కాలికి బలపం కట్టుకొని తిరిగా.. చంద్రబాబు
posted on Jan 30, 2016 @ 11:39AM
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాను హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో వివరించారు. ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను తానే అభివృద్ధి చేశానని, ఆ అభివృద్ధి ఫలితాలనే నేడు అనుభవిస్తున్నారని అన్నారు. అంతేకాదు హైదరాబాద్ లో ఐటీని ఎలా అభివృద్ది చేయడానికి కష్టపడ్డారో కూడా తెలిపారు. హైదరాబాద్లో ఐటీ అభివృద్ధికి చాలా కష్టపడ్డానని.. ఐటీ కంపెనీలు తీసుకురావడానికి అమెరికాలో తాను కాలికి బలపం కట్టుకొని తిరిగానని ఆయన చెప్పారు. ముందుచూపుతో ఐటిని అభివృద్ధి చేశానని అన్నారు. ఇంకా గత ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాదు పరిధిలో 14 శాసనసభ సీట్లు, రెండు పార్లమెంటు సీట్లు గెలిచామని, టిడిపిపై ప్రజలు అచంచల విశ్వాసంతో ఉన్నారని తెలిపారు.