వాలంటైన్స్ వీక్ మొదటి రోజే రోజ్ డే జరుపుకుంటారు ఇందుకే..!
posted on Feb 7, 2025 @ 9:30AM
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న రోజ్ డే జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ వీక్ ప్రారంభంలో మొదటి రోజు. ఈ రోజున, ప్రేమికులు, స్నేహితులు, బంధువులు తమ ఆప్యాయత, భావాలను వ్యక్తీకరించడానికి గులాబీలను ఇస్తారు. రోజ్ డే కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు, స్నేహం, సామరస్యం , శాంతికి చిహ్నం కూడా. చిన్న చిన్న సంజ్ఞలతో మన సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని ఈ రోజు మనకు బోధిస్తుంది.
రోజ్ డే ఎందుకు జరుపుకుంటాము?
రోమన్ రాజు క్లాడియస్ II (3వ శతాబ్దం) పాలనలో ప్రేమ, వివాహాలను ప్రోత్సహించడానికి సెయింట్ వాలెంటైన్ పోరాడాడని నమ్ముతారు. ఈ కారణంగా అతను శిక్షించబడ్డాడు కూడా. అతని ప్రేమ, త్యాగం జ్ఞాపకార్థం వాలెంటైన్స్ వీక్ జరుపుకోవడం ప్రారంభమైంది, దీనిలో మొదటి రోజు రోజ్ డే.
రోజ్ డే ప్రాముఖ్యత..
గులాబీని ప్రేమ, స్నేహం, భావోద్వేగాలకు చిహ్నంగా చూస్తారు. వివిధ రంగుల గులాబీలు వివిధ భావోద్వేగాలను సూచిస్తాయి.
ఉదా.. ఎర్ర గులాబీలు నిజమైన ప్రేమకు చిహ్నం.
పసుపు గులాబీని స్నేహం, ఆనందానికి చిహ్నంగా భావిస్తారు.
తెల్ల గులాబీలను శాంతికి, నూతన ప్రారంభాలకు చిహ్నంగా పరిగణించవచ్చు.
గులాబీ రంగు గులాబీలు కృతజ్ఞతను, ప్రశంసలను సూచిస్తాయి.
నారింజ రంగు గులాబీలు అభిరుచి, ఉత్సాహం, ఆకర్షణను సూచిస్తాయి.
అర్థమైందా..
రోజ్ డే రోజు గులాబీని ప్రేమికులకు మాత్రమే ఇవ్వాలనే రూల్ లేదు. ప్రియమైన వారికి, ఆత్మీయులకు, మనకు ప్రత్యేకం అనుకున్న ఎవరికైనా పైన చెప్పుకున్న రంగులను అనుసరించి గులాబీలు ఇవ్వవచ్చు.
*రూపశ్రీ.