కొవిడ్ కట్టడికి కోవాగ్జిన్ వరం! అమెరికా పరిశోధకుల రిపోర్ట్
posted on Apr 28, 2021 @ 2:32PM
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహ్మమారి కట్టడికి భారత్ బయోటెక్ ఉత్పత్తి చేసిన కోవాక్సిన్ అద్బుత ఔషదమని అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు. 617 కరోనా వేరియంట్లతో పాటు ఇండియన్ డబుల్ మ్యూటాంట్ స్ట్రెయిన్‌ను కోవాగ్జిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు వైట్ హౌస్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ , నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ ఫెక్షియస్ డిసీజెస్ డైరెక్టర్ఆంథోనీ ఫౌసీ తెలిపారు. ఇండియా కంపెనీ తయారుచేసిన కోవాగ్జిన్ కరోనాకు గొప్ప విరుగుడు కావచ్చని ఆయన వెల్లడించారు.
కోవాక్సిన్‌ను హైదరాబాద్ కేంద్రంగా ఉన్న భారత్ బయోటెక్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) భాగస్వామ్యంతో అభివృద్ధి చేసింది. తొలుత క్లినికల్ ట్రయల్‌లో ఉన్నప్పుడు జనవరి 3 న అత్యవసర ఉపయోగం కోసం ఆమోదించబడింది. పరీక్ష ఫలితాల తరువాత టీకా 78 శాతం సామర్థ్యాన్ని కలిగి ఉందని ఐసిఎంఆర్ తెలిపింది. కోవాక్సిన్ చనిపోయిన వైరస్ ను ఉపయోగించి తయారుచేసిన వేరియంట్ . ఇక భారతదేశంలో కరోనావైరస్ కేసులు పెరగడానికి దోహదం చేస్తాయని భయపడిన COVID-19 వేరియంట్ అయిన B.1.617 డజనుకు పైగా దేశాలలో కనుగొనబడిందని WHO తెలిపింది.
మరోవైపు భారత్ ను ప్రపంచం ఫెయిల్ చేశాయని ఆంథోనీ ఫౌచీ ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ కు సాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత గండం నుంచి భారత్ ను బయటపడేసేందుకు ప్రపంచ దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.ప్రపంచంలో అన్ని దేశాలకు వైద్య సాయం అందించడంలో ధనిక దేశాలు అసమానతలను ప్రదర్శించాయని మండిపడ్డారు. ఆ అసమానతలకు భారత్ లోని పరిస్థితులే నిదర్శనమని చెప్పారు. ఇప్పటికైనా ధనిక దేశాలు స్పందించి ప్రపంచ దేశాలకు అవసరమైన సాయం చేయాలని ఆయన సూచించారు. అన్ని దేశాలకు సమాన వసతులు కల్పించాలన్నారు.
భారత్ లో ఆక్సిజన్ చాలక చాలా మంది చనిపోతున్నారని, అక్కడ భయంకర పరిస్థితులున్నాయని ఆంథోనీ ఫౌచీ చెప్పుకొచ్చారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా చాలినన్ని లేవని అన్నారు. ఆ గండం నుంచి భారత్ ను గట్టెక్కించేలా ధనిక దేశాలు ముందడుగు వేయాలని పిలుపునిచ్చారు. ఒక దేశంతో మరో దేశానికి ఇప్పుడు ప్రపంచమంతా ముడిపడి ఉందని, ధనిక దేశాలు తమ దగ్గర ఉన్నవి లేని దేశాలకు ఇచ్చి ఉదారత చాటుకోవాలని సూచించారు.