యూపీ ఎన్నికల్లో గెలుపెవరిది..?
posted on Oct 13, 2016 @ 11:21AM
వచ్చే ఏడాది యూపీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలన్న నేపథ్యంలో పార్టీలన్నీ ఇప్పటినుండే కసరత్తు చేసేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అయితే ఇప్పటినుండే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటూ హడావుడి చేసేస్తున్నారు. అయితే ఎన్నికలు ఉన్నప్పుడు ఏ పార్టీ గెలుస్తుందబ్బా అని సర్వేలు చేయడం కామన్. అలాగే యూపీ ఎన్నికల నేపథ్యంలో చేసిన సర్వేలో ఏపార్టీ గెలుపు సాధిస్తుందో ఓ లుక్కేద్దాం. యూపీ ఎన్నికల నేపథ్యంలో చేసిన తాజా సర్వేలో భారతీయ జనతా పార్టే ఆ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని తేలింది. రానున్న ఎన్నికల్లో బీజేపీ 170-183 స్థానాలను గెలుచుకు ఆ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని సర్వే ఫలితాల ద్వారా తెలిసింది. ఇదిలా ఉండగా ఇండియా టుడే - యాక్సిస్ నిర్వహించిన మరో సర్వేలో మాత్రం... 115-124 సీట్లతో ప్రతిపక్ష బీఎస్పీ రెండోస్థానాన్ని కైవసం చేసుకుంటుందని, సమాజ్‌వాదీ పార్టీకి 94-103 స్థానాలు వస్తాయని ఆ సర్వే తెలుపుతోంది. కాంగ్రెస్ పార్టీకి కేవలం 8-12 మధ్య సీట్లు వస్తాయని తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం మాయావతి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. మరి ఎవరికి అధికారం చిక్కుతుందో చుద్దాం..