మసూద్ అజర్, హఫీజ్ సయీద్ లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..? పాక్ పత్రిక
posted on Oct 13, 2016 @ 10:45AM
ప్రస్తుతం ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ పై అగ్రదేశాలు పూర్తి వ్యతిరేక భావంతో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. అయితే ఇప్పుడు పాకిస్థాన్ పరువు తీస్తున్న జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్, జమాతే ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ లపై పాకిస్థాన్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు తలెత్తుతున్నాయి. పాక్ పత్రిక 'ది నేషన్' తన సంపాదకీయంలో హక్కానీ నెట్ వర్క్, తాలిబాన్లు, లష్కరే తోయిబా వంటి సంస్థలకు సైన్యం కోవర్టు మద్దతిస్తోందని ఆరోపించిన పత్రిక, అజర్, సయీద్ వంటి వారిపై చర్యలు తీసుకోవడం మానేసి పత్రికలకు పాఠాలు చెబుతోందని ఆరోపించింది. కాగా, పఠాన్ కోట్ ఉగ్రదాడి మాస్టర్ మైండ్ మసూద్ అజర్, 2008 ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్ లు పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్న సంగతి తెలిసిందే.