ఇది కదా స్వామి భక్తి అంటే..!
posted on Sep 5, 2022 @ 3:16PM
జై జై గణేషా..అంటూ గణేష మండపాలు మార్మోగుతున్నాయి. గణేష నిమజ్జన చాలా ప్రాంతాల్లో ఆరంభ మయింది. గ్రామాల్లో, పట్టణాల్లో చాలా ప్రాంతాల్లో ఇప్పటికే చాలా గణేష విగ్రహాలు నిమజ్జన మయ్యాయి. గణేషుని ఊరేగిస్తూ భక్తి పారవశ్యంతో పాటు సరదా కూడా జోడించి భక్తిపాటలతో పిల్లలు, పెద్దవాళ్లు బళ్లమీద ఊరేగిస్తూ తీసికెళ్లడం మామూలు. ఇది అన్ని ప్రాంతాల్లో జరిగేదే. చాలామటుకు నిజంగా సంగీతపర సాంప్రదాయ రీతి పాటలు, లేకపోతే సినిమా భక్తిపాటలతో ఊరేగిస్తూంటారు. మధ్యలో జై బోలో గణేష్ మహారాజ్‌కీ జై అంటూ అరుస్తూ నానా సందడిగా వాహనాలు కదిలిపోతూంటాయి.
సంప్రదాయపద్ధతికి కాస్తంత రాజకీయరంగూ జోడిస్తున్నారు ఇటీవల. అన్ని ప్రాంతాల్లోని రాజకీయ నాయ కులు కూడా గణేషుని ఊరేగింపులో పాల్గొని తమ ప్రాంతీయులను ఆకట్టుకోవడానికి, పార్టీ పరంగా వారిని దగ్గర చేసుకోను వీలయినంతగా శ్రమిస్తున్నారు. గణేష మండపాల ఏర్పాటు, పూజలు, ఇపుడు ఊరేగింపు అన్నింటా ఆయాప్రాంత రాజకీయనాయకులు వారి వారి పార్టీలను బాగానే ప్రచారం చేసు కుంటున్నారు. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన ఒక గణేష ఊరేగింపులో భక్తి పాట మార్చేసి మరీ రాజకీయ రంగు పులిమి ఆనందించారు.
గణేషుని ఊరేగింపులో భాగంగా పలాస భక్తగణంతో పాటు చిందులు వేశారు మంత్రి అప్పలరాజు. అంతే కాదు ఆ ఉత్సవంలో జగనన్నా.. జగనన్నా.. జనమంతా నీ వెంటే! అంటూ పాట వినిపించగానే రెండు స్టెప్పులు కూడా వేశారు. గణేష ఉత్సావాల్లో జగనన్నా.. అంటూ పాట ఏమిటో అటుగా పోతున్నవారికి అర్ధం కాలేదు. కాదేదీ కవితకు అనర్హం అన్నారు పెద్దలు.
జగనన్నను కీర్తించడానికి, స్వామిభక్తి ప్రదర్శించడానికి వైసీపీ వారికి సమయం, సందర్భంతో సం బంధం లేదు. గణేషునికంటే జగనన్నే ఈ లోకాన్ని కాపాడతా డన్న వీరాభిమానాన్ని ప్రదర్శించారు. ఇది కదా స్వామి భక్తంటే!