రామన్ మెగసెసె అవార్డు స్వీకరించను..కేరళ మాజీమంత్రి శైలజ
posted on Sep 5, 2022 @ 3:48PM
భారతదేశంలో కోవిడ్ విజృంభించిన సమయంలో వైద్యరంగం అందించిన సేవలు అనన్య సామాన్య మని అందరూ అంగీకరిస్తారు. అన్నిప్రాంతాల్లోనూ డాక్టర్లు, నర్సులు ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేటు ఆస్పత్రులు ఎంతో అద్బుతంగా పనిచేసి ప్రజలను కాపాడడంలో ఎన్నో త్యాగాలు చేసి ప్రజల మన్ననలు అందుకున్నారు. నిఫా వైరస్, కొవిడ్‌తో కేరళ ప్రభుత్వం చేసిన యుద్ధంలో మంత్రిగా శైలజ అద్భుతంగా పని చేశారు. ఆమె సేవలను రామన్ మెగసెసె అవార్డు కమిటీ గుర్తించింది. కానీ కేరళ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి శైలజ ఆ అవార్డును స్వీకరించకూడదని నిర్ణయిం చారు.
ప్రజాసేవకు తన జీవితాన్ని అంకితంచేసిన మహోన్నత వ్యిక్తి రామన్ మెగసెసె సేవకు గుర్తింపుగా ఆయన పేరుతో ఒక అవార్డును ప్రవేశపెట్టారు. 1957 ఏప్రిల్ మాసంలో న్యూయార్క్‌లోని రాక్‌వెల్ బ్రదర్స్ ఫౌండేషన్ వారు ఈ అవార్డును నెలకొల్పారు. ప్రతి సంవత్సరం, వివిధ రంగాల్లో కృషి చేసిన ఆసియాకు చెందిన ప్రముఖులకు ఈ అవార్డును బహుకరిస్తారు. ఆసియా నోబెల్‌గా పేరొందిన ఈ అవా ర్డును ప్రభుత్వ సర్వీసులు, కమ్యూనిటీ లీడర్‌షిప్, జర్నలిజం, లిటరేచర్, శాంతి తదితర రంగా లలో సేవచేసినవారికి ఇస్తారు. తన జీవితకాలం మొత్తం శాంతికోసం పోరాటం చేసిన రామన్ మెగసెసె యువ రాజకీయ నాయ కులకు ఆదర్శవాదిగా పేరు గాంచాడు
రామన్ మెగసెసె అవార్డును స్వీకరించకూడదని కేరళ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి కేకే శైలజ నిర్ణయించు కు న్నారు. దీనిపై శైలజ మాట్లాడుతూ, రామన్ మెగసెసె 64వ అవార్డును తనకు ఇవ్వాలని నిర్ణయించి నట్లు కమిటీ తెలిపింది. తాను రాజకీయ నాయకురాలినని, ఈ అవార్డును రాజకీయ నేతలకు ఎన్నడూ ఇవ్వలేదనీ అన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఉన్న తాను ఈ అవార్డు స్వీకరణ అంశాన్ని పార్టీ నేతలతో చర్చించామన్నారు. దానిని తీసుకోకూడదని సమిష్ఠిగా నిర్ణయం తీసుకున్నామని శైలజ తెలిపారు. రామన్ మెగసెసె అవార్డును ఎన్‌జీవో అందిస్తోంది. ఆ సంస్థ కమ్యునిస్టు పార్టీ సిద్ధాంతాలను బలపరచదని కేరళ మాజీ మంత్రి శైలజ పేర్కొన్నారు.