చెల్లెలిపై.. అన్నల దారుణం..
posted on Apr 7, 2021 @ 10:32AM
ఏమిటో ఈ లోకమంతా.. మనుషుల జీవితాలు నిత్యా జీవితంలో కంటే.. అప్పుడప్పుడు వచ్చే సినిమాల్లోనే నయ్యం అనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మనుషులకన్నా మృగాలే ఇంకా నయ్యం. మృగాలకు కాస్త విచక్షణ జ్ఞానం అయిన ఉంటుంది. కానీ మనిషి మాత్రం విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నాడు. వరసలు మరిచి. మానవత్వం విడిచి. మారణహోమాలు చేస్తున్నాడు. తాజాగా ఇద్దరరు అన్నలు సొంత చెల్లెలిపై అఘాయిత్యానికి పాలుపడ్డాడు.
అతను కొత్తగూడెంలోని సింగరేణిలో రెస్క్యూ విభాగంలో పని చేస్తున్నాడు. అమ్మ, చెల్లితో కలిసి ఉంటున్నాడు.. తండ్రి చిన్నప్పుడే వదిలేశాడు. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. చాలా హ్యాపీ గా ఉన్నారు. కట్ చేస్తే తన చెల్లెలు పెళ్లీడుకు వచ్చింది. చెల్లెలిపై వాడి కన్ను పడింది. అన్నగా తన స్థానం మరిచి, బాధ్యత గాలికి వదిలేసి. మృగంలా ప్రవర్థించి సొంత చెల్లిని శారీరకంగా లోబర్చుకున్నాడు. చిత్రహింసలు పెట్టి నరకం చూపిస్తున్నాడు. ఆ యువతీ చేసేదేమి లేక రక్షణ కోసం పెదమ్మ ఇంటికి వెళితే అక్కడా కూడా ఆమెకు అదే నరకం. వరుసకు బ్రదర్ అయ్యే పెద్దమ్మ కుమారుడూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఈ దారుణం వెలుగుచూసింది.
అన్న అఘాయిత్యాల గురించి బాధితురాలు.. కన్నతల్లికి, పెద్దమ్మ కుటుంబసభ్యులకు చెప్పినా పట్టించుకోలేదు. గత్యంతరం లేక స్నేహితులు, గతంలో తనకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులతో కలిసి పోలీసులను ఆశ్రయించింది. విషయాన్ని బయటపెడితే చంపుతామని బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని బాధితురాలు వాపోతోంది. ఘటనపై బాధితురాలి సోదరుడు, ఆమెతల్లి, పెద్దమ్మ, ఆమె భర్త, కుమారుడిపై నిర్భయ కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.