వివాహ వేడుకలో మారణహోమం.. 30 మంది మృతి
posted on Aug 21, 2016 @ 11:45AM
ప్రపంచ దేశాల్ని తమ దాడులతో వణికిస్తున్న ఉగ్రవాదులు మరోసారి టర్కీపై తమ పంజా విసిరారు. ఇప్పటికే రెండు సార్లు టర్కీపై దాడి జరిపిన ఉగ్రవాదులు.. ఇప్పుడు మరోసారి దాడి జరిపి మారణహోమం సృష్టించారు. ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడి..30 ప్రాణాలు బలిగొన్నాడు. వివరాల ప్రకారం.. సిరియా సరిహద్దు ప్రాంతంలోని టర్కిష్ పట్టణంలో ఉన్న గజియాన్‌టెప్‌లో ఓ వివాహ వేడుక జరుగుతుండగా ..ఓ ఉగ్రవాది బాంబులు అమర్చుకుని వివాహ వేడుకకు వచ్చి తనకుతాను పేల్చుకుని ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు. ఈ ఘటనలో 30 మంది అక్కడి మరణించగా మరో 90 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అంతేకాదు మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. టర్కీ సరిహద్దు ప్రాంతాలను మూసివేసిన అధికారులు, హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఐసిస్‌కు అనుంబంధంగా ఉన్న కుర్దిష్ మిలిటెంట్లు దాడికి పాల్పడినట్లు గుర్తించారు.