ట్రంప్ టారీఫ్ ల మోత.. ప్రభావితమయ్యే రంగాలేంటో తెలుసా?
posted on Aug 7, 2025 @ 10:44AM
భారత్‌పై అదనంగా పాతిక శాతం సుంకాలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. దీంతో భారత్ నుంచి దిగుమతి అయ్యే కీలక ఉత్పత్తులపై ఏకంగా 50 శాతం మేర సుంకాలను విధించినట్లైంది. ట్రంప్ నిర్ణయం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా లెదర్, వజ్రాలు, ఆభరణాలు, టెక్స్‌టైల్స్, రసాయనాలు వంటి భారత కీలక ఎగుమతి రంగాలు ఈ నిర్ణయంతో తీవ్రంగా ప్రభావితమౌతాయి. ఆయా రంగాలు సంక్షోభంలో కూరుకుపోయే ముప్పు కూడా ఉంది. ఇప్పటికే ఉన్న సుంకానికి అదనంగా, బుధవారం (ఆగస్టు 6) నుంచి పాతిక శాతం, ఆగస్టు 27 నుంచి మరో పాతిక శాతం టారిఫ్ పెరుగుతుంది. దీనితో భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు దాదాపు 50 శాతం వరకూ పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అంతే కాకుండా అమెరికా మార్కెట్లో భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతాయి. ఫలితంగా వాటికి డిమాండ్ పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది.
ప్రధానంగా టెక్స్‌టైల్స్, వజ్రాలు, అర్నమెంట్స్, ఫుట్ వేర్, ఫ్రాన్స్, రసాయనాలు, యంత్ర పరికరాల రంగాలపై ఈ టారిఫ్ పెంపు ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. భారత్ ఎగుమతులలో ముఖ్యంగా, భారత ఎగుమతుల్లో కీలక మూర డైమండ్స్, ఆర్నమెట్స్ పరిశ్రమ నష్టాలలో కూరుకుపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని పరిశ్రమల వర్గాలు చెబుతున్నాయి. ఈ టారిఫ్ పెంపు.. ఈ రంగంలో పని చేసే కార్మికుల ఉపాధి, ఉద్యోగావకాశాలను గణనీయంగా ప్రభావితం చేసే అవకాశం ఉందంటున్నారు.