కేటీఆర్‌కు ఎమ్మెల్యేల ఫిర్యాదు.. ప్రగతిభవన్‌పై తిరుగుబాటు తప్పదా?
posted on Aug 25, 2021 @ 3:57PM
హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఓడిపోతే, ప్రభుత్వం ఏమీ కూలీపోదు, పార్టీ ఆవిర్భావం నుంచి అనేక ఎన్నికలు జరిగాయి, అందులో ఇదొకటి, అంటూ, అధికార తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మంగళవారం, పార్టీ కార్యవర సమావేశం వివరాలను మీడియాకు వివరించే సమయంలో చేసిన వ్యాఖ్యలు, పార్టీలో రాజకీయ వర్గాలలో సంచలనంగా మారాయి. ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు, ఓ వంక పార్టీ, ప్రభుత్వం, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎలగైనా హుజూరాబాద్’లో గెలిచి తీరాలని కంకణం కట్టుకున్న సమయంలో, కేటీఆర్, అదే హుజూరాబాద్ ఉప ఎన్నికను, ఇంతలా డౌన్ ప్లే చేసే ప్రయత్నం ఎందుకు ఎందుకు చేశారు, అనే చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. కొందరు ముఖ్య నాయకులు అయితే, ఇప్పటికే ముదిరి పాకన పడినట్లు కనిపిస్తున్న ఫ్యామిలీ పాలిటిక్స్’లో ఇది మరో అంకం ఆరంభానికి సంకేతమా, అన్న సదేహలు వ్యక్తపరుస్తున్నారు.
కేటీఅర్ మంగళవారం జరిగిన తెరాస కార్యవర్గ సమావేశం తాలూకు మీడియా బ్రీఫ్’లో హుజూరాబాద్ ఉప ఎన్నికని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేశారు. చివరకు, అయన ఎవరిని ఉద్దేశించి ఆ మాటలు అన్నారో ఏమో కానీ, హుజూరాబాద్’లో తెరాస అభ్యర్ధి ఓడిపోయినా, పెద్దగా ఫరక్ పడదని చెప్పుకొచ్చారు. ఒక్క నియోజక వర్గంలో ఒడి పోయినంతమాత్రాన రాష్ట్రంలో తమ ప్రభుత్వం కూలిపోదని, ఒక వేళ గెలిచిన కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి రాదని అన్నారు. అయితే, కేటీఆర్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు? హుజూరాబాద్’ ఉప ఎన్నికకు హైప్ క్రియేట్ చేసింది, ముఖ్యమంత్రి కేసీఆర్, అందులో భాగంగానే హరీష్ రావు మళ్ళీ మరోమమారు ప్రాధాన్యత పెరిగింది. ఒక విధంగా ఆయన, హుజూరాబాద్ ఉప ఎన్నికను అడ్డుపెట్టుకుని, వ్యూహాత్మకంగా అడుగులు వేసి, ఒక విధంగా ఏకు మేకై కూర్చున్నారనే అభిప్రాయం పార్టీలోనే వినిపిస్తోంది.అందుకే, కేటీఆర్, ఈవ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదలా ఉంటే, అదేమీ లేదు, నిధుల విడుదలకు, పదవుల పంపకానికి సంబంధించి హుజూరాబాద్ నియోజక వర్గానికి ఇస్తున్న ప్రాధాన్యత దృష్ట్యా అధికార పార్టీ ఎమ్మెల్యేలు వ్యక్తపరుస్తున్న ఆందోళలను దృష్టిలో ఉంచుకుని కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరు విశ్లేషిస్తునారు.
అదెలా ఉన్నా, ఉప ఎన్నిక జరుగుతున్నహుజూరాబాద్’కు వరదలా నిధులు పారుతున్నా, మిగిలిని నియోజక వర్గాల్లో కనీసం, నియోజక వర్గ అభివృద్ధి నిధులకు కూడా దిక్కు లేదు. ఎన్నికలు జరిగి రెండు సంవత్సరాలు అయినా ఇంతవరకు,ఒక్క సంవత్సరం కూడా నియోజక వర్గం అభివృద్ధి నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాలేదు. ఇలా అయితే ఎలా. ప్రజలకు ఏమి సమాధానం చెపుతామని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తేనే నిధులు వస్తాయనే అభిప్రాయంతో ఎమ్మెల్యేలు రాజీనామ కోసం ప్రజల నుంచి వత్తిడి వస్తోంది. అందుకే ఎమ్మెల్యేలు నాయకత్వం వద్ద ఆందోళన వ్యక్త పరుస్తున్నది మాత్రం నిజం.
ఈ నేపధ్యంలోనే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్’ వద్దకు ఎమ్మెల్యేలు క్యూకడుతున్నారు. ప్రజల నుంచి వత్తిడిని, తమ బాధలను వెళ్ళబోసుకుంటున్నారు. తమ నియోజక వర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని వినతిపత్రాలు అందిస్తున్నారు. నిధులు విడుదల చేసినా చేయక పోయినా, ఒక వినతి పత్రం ఇచ్చి, ఓ ఫోటో దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, ప్రజల ముందు తలెత్తుకోవచ్చని ఎమ్మెల్యేలు ఆశ పడుతున్నారని, అందుకే కేటీఆర్ ప్రతి రోజు కొందరు ఎమ్మెల్యేలను కలిసి వినతి పత్రలను స్వేకరిస్తున్నట్లు సమాచారం. ఇలా కలిసిన సమయంలో ఎమ్మెల్యేలు రాష్ట్రంలో హుజూరాబాద్ నియోజక వర్గం ఒక్కటే ఉన్నదా, ఆ ఒక్క నియోజక వర్గం ఓటర్లు మాత్రమే ఓటర్లా, మిగిలిన నియోజక వర్గాల ఓటర్ల ఓట్లు పార్టీకి అవసరం లేదా, అని ప్రజలు తమపై వత్తిడి తెస్తున్నారని, చెప్పుకుని వాపోతున్నారు. అందుకే కావచ్చును కేటీఅర్ మంగళవారం జరిగిన తెరాస కార్యవర్గ సమావేశం తాలూకు మీడియా బ్రీఫ్’లో హుజూరాబాద్ ఉప ఎన్నికని డౌన్ ప్లే చేసే ప్రయత్నం చేశారని, అంతకు మించి ఏమీ లేదని, తెరాసలో అసలు విబేధాలే లేవని, కూడా కొందరు నమ్మపలుకుతున్నారు. అయితే, ఇందులో ఏది నిజం ఏది కాదు, అనేది ప్రస్తుతానికి జవాబు లేని ప్రశ్న అంటున్నారు.