TRSదే గెలుపు!
posted on Feb 2, 2016 @ 6:35PM
గ్రేటర్ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలైంది. ఇవి కాకుండా వివిధ పార్టీలు కూడా తమ వర్గాల ద్వారా ఓటర్ల ఎవరికి విజయాన్ని కట్టబెట్టారన్న దానిమీద ఒక నిర్ణయానికి వచ్చాయి. శాతం ఓటర్లు, పోలింగ్ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు ఊహిస్తున్నదాని ప్రకారం ఈ ఎన్నికలలో టీఆర్ఎస్ తాను కూడా ఊహించనన్ని సీట్లను గెల్చుకోబోతోంది. మరో పార్టీతో పొత్తు పెట్టుకునే అవసరం లేకుండానే తాను సొంతగా మేయర్ అభ్యర్థిని గెలిపించుకునే స్థాయిలో ఈ పార్టీకి విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ప్రకారం టీఆర్ఎస్ 75 నుంచి 80 వార్డులను కైవసం చేసుకునే అవకాశం ఉంది.
ఇక రెండో స్థానం ఎవరిదన్నదే ఇప్పుడ తేలాల్సిన విషయం. అటు టిడిపి-బిజేపీ కూటమికీ, ఇటు ఎంఐఎంకీ కూడా 30 సీట్లు వస్తాయని ఊహిస్తున్నారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ నాలుగో స్థానానికి పడిపోయే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్‌కు 10 మించి వార్డులు దక్కవని కొందరి అంచనా! మరో వైపు 600కి పైగా ఉన్న స్వతంత్ర అభ్యర్థులు చాలామంది దారుణంగా ఓడిపోయే సూచనలు కనిపిస్తున్నాయి.