షబ్బీర్ అలీ మీద దాడి!
posted on Feb 3, 2016 8:40AM
గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినప్పటికీ చివరి అంకంలో బాహాబాహీ యుద్ధాలు తప్పలేదు. పాతబస్తీలో జరిగిన పురానాపూల్ సంఘటనలో సాక్షాత్తు కాంగ్రెస్ ముఖ్యనేత షబ్బీర్ అలీ మీదే దాడి జరిగింది. అక్కడ మహమ్మద్ గౌస్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. గౌస్ ఒకప్పుడు మజ్లిస్ తరఫున గెలిచి ఇప్పడు కాంగ్రెస్ పక్షానికి మారడంతో స్థానిక మజ్లిస్ కార్యకర్తలంతా ఆయన మీద గుర్రుగా ఉన్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచే అరెస్టులు, వాగ్వాదాలు సాగాయి. సాయంత్రానికి ఇరుపక్షాల నేతలు కూడా అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిపోయింది. గౌస్‌కి మద్దతుగా వచ్చిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వాహనాన్ని మజ్లిస్ కార్యకర్తలు ధ్వంసం చేయడమే కాకుండా, అందులో ఉన్న షబ్బీర్ అలీ మీద భౌతికంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు చోద్యం చూస్తుండిపోవడం గమనార్హం. చివరికి పోలీసులు జోక్యంతో ఉద్రిక్తత చల్లారింది.