మమ్మల్ని చేరాలంటే మొసళ్లు దాటాలి.. మమతా బెనర్జీ
posted on Jul 26, 2022 @ 10:24AM
తమ మంత్రి పార్థాఛటర్జీని అరెస్టు చేయడమేగాకుండా ఆయన్ను కేంద్రప్రభుత్వంతో అనుబంధం ఉన్న ఇఎస్ ఐ ఆస్పత్రికి తరలించడంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై మండి పడ్డారు. ఇదంతా కేవలం కుట్ర ధోరణి అని అమె అన్నారు. మహారాష్ట్ర తర్వాత తమపై విరుచుకుపడటానికి మమ్మల్ని అవమానించడానికే ఇలాంటి చర్యలు బీజేపీ వర్గాలు పాల్పడుతు న్నాయని ఆమె విరుచుకు పడ్డారు. బెంగాల్‌కు రావాలంటే బే ఆఫ్ బెంగాల్ దాటాలి, సముద్రంలో మొసళ్లు తినేస్తాయి జాగ్రత్త అని మమత హెచ్చరించారు.
మంత్రిని తమకు అనుకూలమైన ఆస్పత్రికి తరలించడమే రాష్ట్రప్రభుత్వాన్ని అవమానించడమని మమతా బెనర్జీ అన్నారు. అంటే కేంద్రం అమాయకంగా వ్యవహరిస్తున్నది, రాష్ట్రాలే దోచుకునే దొంగలు గా భావించడంలో అర్ధంలేదన్నారు. ఇలా వ్యవహరించడం బెంగాల్ ప్రజల్ని అవమానించడం కాదా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. రాష్ట్రాల మీద ఆధారపడి ఉన్నది మీరేనని అలాంటపుడు రాష్ట్రాలను ఈ విధం గా అవమానించడంలో అర్ధమేమిటని ఆమె ప్రశ్నించారు. మహారాష్ట్రా ఈ పర్యాయం మీతో యుద్ధం చేయ లేక పోయింది. ఆ రాష్ట్రం తర్వాత ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్, బెంగాల్ మీద బీజేపీ దృష్టి పెట్టింది. కానీ ఇటు రావడానికి ప్రయత్నించకండి, సముద్రంలో మొసళ్లు కాకుంటే సుందర్‌బన్ జిల్లాలో రాయల్ బెంగాల్ పులులు మిమ్మల్ని కరిచిపడేస్తాయని, ఉత్తర బెంగాల్ లో ఏనుగులు తొక్కిపడేస్తాయనీ మమతా బెనర్జీ బీజేపీని హెచ్చరించారు.
పార్థ ఛటర్జీ అరెస్టు చేసిన తర్వాత తనకు చేసిన కాల్‌లకు సమాధానం లేకుండా పోయిందని ఉదయం సంచలనం కలిగించిన తర్వాత ఈ విషయంపై బెనర్జీ మాట్లాడారు. ఇప్పుడు అవినీతి ఆరోపణలతో పోరా డుతున్న తన ముఖ్య సహాయకుల్లో ఒకరైన మంత్రిని దూరం పెట్టడానికి ముఖ్యమంత్రి చేసిన ప్రయ త్నంగా ఇది కనిపించింది.
ఈ రోజు, ముఖ్యమంత్రి అవినీతి లేదా ఏదైనా అక్రమాలకు మద్దతు ఇవ్వడం లేదని అన్నారు. అప్పుడు ఆమె, ఏజెన్సీలను ఉపయోగించి నా పార్టీని విచ్ఛిన్నం చేయగలదని బిజెపి భావిస్తే తప్పు, నిజం బయట కు రావాలి, కానీ గడువులోపు బయటపెట్టాలని హెచ్చరించారు.
ఎవరినీ విడిచిపెట్టేది లేదు. ఎవరైనా దొంగ లేదా దోపిడీదారు అయితే, టిఎంసీ వారిని విడిచిపెట్టదు, నేను నా స్వంత వ్యక్తులను అరెస్టు చేసాను, నేను నా ఎమ్మెల్యేలను మరియు ఎంపీలను, మంత్రులను కూడా విడిచిపెట్టను. కానీ మీరు ప్రయత్నిస్తే నాపై సిరా వేయండి, నేను మీపై చెత్త వేయగ లనని ఆమె అన్నారు.