ఇన్ స్టాగ్రామ్ తో యువతికి 9.50 లక్షల టిప్పు..
posted on Feb 15, 2021 @ 9:53AM
మనకోసం పని చేసిన వాళ్లకు.. మనం ఎప్పుడు రుణపడి ఉంటాం.. ఆ రుణం తీర్చుకోవడానికి అప్పుడపుడు వాళ్ళకి మనకు తోచిన సహాయం చేస్తుంటాం.. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నా, తాగినా, మనకు సర్వ్ చేసిన వారికి ఎంతో కొంత టిప్ ఇచ్చే బయటకు రావడమనేది వారి శ్రమని గౌరవించడంతో పాటు.. వారి కష్టానికి ఊరట ఇచ్చినవాళ్ళం అవుతాం.. అదే సర్వర్లు కూడా ఊహించని రీతిలో రూ. 9.42 లక్షలు టిప్ గా ఇస్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు.. గతంలో ఎన్నో మార్లు తమకు నచ్చిన వెయిటర్లకు భారీగా టిప్ ఇచ్చిన ఘటనలు కూడా మనకు తెలుసుక. తాజాగా, యూఎస్ లోని న్యూయార్క్ లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి ఓ కస్టమర్ ఏకంగా 13 వేల డాలర్లు అంటే దాదాపు రూ. 9.42 లక్షలు టిప్ గా ఇచ్చి ఆమెను అవాక్కు చేశాడు.
న్యూయార్క్ లో లిల్లీస కాక్ టైల్ రెస్టారెంట్ పేరిట ఓ హోటల్ ఉండగా, అక్కడ ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్ గా పని చేస్తోంది. ఆ హోటల్ కు రెగ్యులర్ గా వెళ్లే రాబిన్ స్కాల్ అనే కస్టమర్, ఆమెను చూసి, ఆమెకేదైనా సాయం చేయాలని భావించాడు. అంటే తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పి, ఎంతో కొంత సాయం చేయాలని, తాను ఆమెకు డబ్బులు ఇచ్చి సాయపడతానని కోరాడు. ఈ పోస్ట్ పెట్టే సమయంలో ఓ 1000 డాలర్ల నిధిని సేకరించి, ఆమెకు ఇచ్చినా తనకు సంతోషమేనని రాబిన్ భావించాడు. అయితే, నిమిషాల వ్యవధిలోనే 13 వేల డాలర్లు పోగయ్యాయి.
దీంతో ఆ డబ్బును తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లిన రాబిన్ స్కాల్, ఆమెకు మొత్తం తాను సేకరించిన మొత్తాన్ని టిప్ గా ఇచ్చి వచ్చాడు. తొలుత నమ్మలేకపోయినా, ఆపై విషయం తెలుసుకున్న ఆమె, స్కాల్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఫాలోవర్లకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.