మరి మోదీ ఎందుకు దూరం పెట్టారు, గడ్కరీ?
posted on Aug 29, 2022 @ 12:51PM
ఒకసారి రాజకీయాల్లోకి వచ్చాక ఏ పార్టీని అంటిపెట్టుకుంటే దానికే కడదాకా ఉండేవారు ఈ రోజుల్లో తక్కువే. చాలామంది రాజకీయపరిస్థితులు అనుసరించి, కాలక్రమంలో ప్రాధాన్యత అనుసరించి, తమ స్థానం ప్రాధాన్యత, గౌరవమర్యాదల లెక్కలన్నీ బేరీజు వేసుకుని చాలామంది చాలా పార్టీలు మారుతూనే ఉన్నారు. విద్యార్ధిదశ నుంచి బీజేపీనే అంటిపెట్టుకున్న నాయకుడు నితిన్ గడ్కరీ. కానీ గడ్కరీకి పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడం ఏమిటన్నది గడ్కరీ అనుచరులను ఇబ్బందిపెడు తోంది.
ఆయన్ను విద్యార్ధి దశలో ఉన్నప్పుడే కాంగ్రెస్ వల వేసి పట్టే యత్నం చేసిందట. కానీ ఆయన బావిలో నైనా దూకుతాగాని కాంగ్రెస్‌లోకి మాత్రం రానని భీష్మించారట! గడ్కరీ పక్కా బీజేపీ మనిషి. పార్టీలో తన తొలినాళ్ల గురించి గురించి అనేక విశేషాలు స్నేహితులతో ఇటీవల నెమరేసుకున్నా రాయన.
ఒకసారి నమ్మినవారిని కష్టాల్లో వదిలేయకూడదు, అలాంటపుడు ఆ వ్యక్తి మీద నిజమైన అభిమానం లేన ట్టే అవుతుంది. అలాగే ఏ పార్టీని నమ్ముకుంటే అదే పార్టీని చివరంటా పట్టి ఉండాలేగాని అవసర కాలం లో మధ్యలో వదిలేయడం రాజకీయనాయకులకు మంచిదికాదని గడ్కరీ అన్నారు. మానవసంబంధాలు బలంగా ఏర్పరచుకోవడం అన్ని రంగాలకీ ఎంతో అవసరమన్నది ఆయన అభిప్రాయం. కానీ ఇంత మంచివాడివి ఈ పార్టీలో ఇన్నాళ్లు ఎందుకున్నావని ఒక స్నేహితుడు సందేహాన్ని బయటపెట్టారు. దానికి సమాధానం చెబుతూ, తాను ఎలాంటివాడినన్నది పార్టీ అధినేతకు తెలుసు. ఎవరయినా తన పని తాను చేసుకుపో వడం పార్టీ మరింతగా ప్రజల్లోకి వెళ్లడం మాత్రమే ఆలోచించాలన్నారు.
ఎన్నికల్లో ఓటమి కంటే పార్టీని విడిచిపోవడం ఒక రాజకీయనాయకుని ఓటమి అనిపించుకుంటుందని గడ్కరీ అన్నారు. కానీ అనూహ్యంగా ఇటీవల గడ్కరీ బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుంచి బయటికి పంపారు. ఈ నిర్ణయం గడ్కరీని కొంత ఆశ్చర్యపరిచింది. బీజేపీ ప్రభుత్వంలో సీనియర్ నాయకునిగా, పార్టీ మాజీ అధ్యక్షునిగా అందరి ఆదరాభిమానాలు పొందారు.కానీ మోదీ, షా ద్వయం తీసుకు న్ననిర్ణయం ఊహించని హఠాత్పరిణామమే. మరి ఇది గడ్కరీని ఎంతవరకూ మర్యాదగా చూసుకు న్నారన్నది ప్రశ్నార్ధకమే.
గడ్కరీ పార్టీలో బలమైన నేతగా, అత్యధికులకు ఇష్టమైన నాయకుడిగా ఎదిగారు. 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే భాగస్వామ్య పార్టీలలో మోడీ నాయకత్వం పట్ల, ఆయన వ్యవహార శైలి పట్ల అసంతృప్తి బాగా వ్యక్తమైన సమయంలో మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానిగా గడ్కరీ పేరు పరిశీలనలోకి వచ్చినట్లు కూడా చెబుతారు. పైగా నితిన్ గడ్కరీ నాగపూర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న వ్యక్తి. ఆర్ఎస్ఎస్ నుంచి ఎదిగిన నేత. నీటికీ స్వయం సేవక్ సంఘ్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే వ్యక్తి. అటువంటి గడ్కరీకి పార్టీలో ప్రాధాన్యత తగ్గించేయడమంటే.. పార్టీకి సిద్ధాంత పునాదిని వేసిన ఆర్ఎస్ఎస్ భావ జాలాన్ని తిరస్కరించడమేగా పార్టీలోని పలువురు భావిస్తున్నారు.
పార్టీ, ప్రభుత్వం రెండూ మోడీ, షా ద్వయమే అన్నట్లగా పరిస్థితి మారిపోయింది. గతంలో కాంగ్రెస్ ను వ్యక్తిపూజ అంటే విమర్శలు గుప్పిం చిన బీజేపీలో ఇప్పుడు అదే పరిస్థితి ఉందని బీజేపీలోని ఒక వర్గం గట్టిగా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో గడ్కరీకి పార్లమెంటరీ బోర్డు నుంచి ఉద్వాసన పలకడంతో పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగసి పడుతు న్నాయి.