నవరత్నాలు కాదు నవ మోసాలు
posted on Jun 29, 2023 @ 3:08PM
నవరత్నాల పేరిట జగన్నాటకాన్ని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చన్నాయుడు బట్టబయలు చేశారు. జగన్ నవరత్నాల బాగోతంపై తెలుగుదేశం నివేదికను ఆయన విడుదల చేశారు. ప్రకాశించని నవరత్నాలు-జగన్ మోసపు లీలలు పేరిట విడుదల చేసిన ఆ నివేదికలో జగన్ సర్కార్ అబద్ధపు హామీల నిగ్గు తేల్చారు.
వైసీపీ మేనిఫెస్టోలో 99 శాతం హామీలు అమలు చేశారనడం వైసీపీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని అచ్చన్నాయుడు పేర్కొన్నారు. పాదయాత్ర హామీలు 10 శాతం కూడా అమలు చేయలేదనీ, నవరత్నాల హామీల్లో 25 శాతం కూడా అమలు చేయలేదనీ పేర్కొన్నారు. ఫేక్ సీఎం ఫేక్ మాటలు తప్పుడు ప్రచారంతో ప్రజలను జగన్ మోసం చేస్తున్నారనీ, రైతు భరోసా కింద 12 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయలేదనీ నివేదిక పేర్కొంది. అలాగే వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద ఇచ్చిన 8 హామీల్లో ఒక్కటీ అమలు కాలేదనీ, పింఛన్ల పెంపు కింద ఇచ్చిన 3 హామీల్లో 2 ఇంత వరకూ అమలు కాలేదని పేర్కొంది. అమ్మఒడి కింద ఇచ్చిన రెండు హామీలూ అమలు కాలేదని అచ్చన్నాయుడు అన్నారు. పేదలందరికీ ఇళ్లు పేరిట ఇచ్చిన 5 హామీల పరిస్థితీ అంతేనని అన్నారు.
బోధనారుసుం కింద ఇచ్చినరెండు హామీల్లో ఒక్కటీ అమలు కాలేదన్నారు. వైఎస్సార్ జలయజ్ఞం కింద ఇచ్చిన 3మూడు హామీలూ పెండింగ్‍లోనే ఉన్నాయన్నారు. మద్యనిషేధమంటూ ఇచ్చిన హామీ పరిస్థితీ అంతేనని, అలాగే వైఎస్సార్ ఆసరా, చేయూత కింద ఇచ్చిన నాలుగు హామీలూ నెరవేరలేదని అచ్చన్నాయుడు అన్నారు. నాలుగేళ్ల వైసీపీ పాలనలో పేదవాడికి సరైన వైద్యం అందడం లేదనీ, జగన్ చెప్పే మాటలన్నీ అసత్యాలేనని అచ్చన్నాయుడు విమర్శించారు. ఎన్నికల ముందు చెప్పింది ఒకటి.. అధికారంలోకి వచ్చాక చేసింది మరొకటి అన్నారు. అమ్మఒడి కింద రూ.15 వేలు ఇస్తామన్నారనీ, కానీ ఇచ్చింది మాత్రం రూ.13 వేలేనన్నారు. రాష్ట్రంలో 84 లక్షల మంది పిల్లలు ఉంటే 42 లక్షల మందికే అమ్మఒడి ఇస్తున్నారన్నారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక తల్లికి వందనం కార్యక్రమంద్వారా ప్రతి మహిలకు రూ.15 వేలు ఇవ్వాలని నిర్ణయించామని అచ్చన్నాయుడు చెప్పారు. ఫించన్ రూ.200 ఉంటే రూ.1800 పెంచి రూ.2 వేలు ఇచ్చాం - మేం 74 లక్షల మందికి పింఛన్ ఇస్తే ప్రస్తుత వైసీపీ సర్కార్ మాత్రం 62 లక్షల మందికి మాత్రమే పిఛను ఇస్తోందన్నారు. జగన్ సర్కార్ 10 లక్షల మందికి పింఛన్ తొలగించిందనీ, ఏవేవో సాకులతో పేదవాడి పథకాలన్నీ తీసేసి మోసం చేస్తోందనీ అచ్చన్నాయుడు విమర్శించారు.