తెగదెంపులు అన్నంత సులువేనా
posted on Jul 30, 2013 @ 9:26PM
కాంగ్రెస్ అన్నంత పని చేసింది. 50 ఏళ్లుగా నలుగుతున్న తెలంగాణ విషయాన్ని మూడు రోజుల్లో తేల్చేసింది.. 10 జిల్లాలతో కూడిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్ పార్టీతో పాటు యుపిఏ సర్కార్ కూడా సమ్మతిస్తూ ఏక వాఖ్య తీర్మానం చేసింది. నాలుగు నెలలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పూర్తిచేస్తామన్న కాంగ్రెస్ రాజధాని విషయంలో మెలిక పెట్టింది. గతంలో ఏ రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో తీసుకొని విదంగా తెలంగాణ విషయంలో ఉమ్మడి రాజధాని విషయాన్ని తెలరపైకి తెచ్చింది. అది కూడా పది సంవత్సరాల సుధీర్ఘ కాలం హైదరాబాద్‌ను రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానికగా ఉంటుందని ప్రకటించింది.
ఈ సమయంలో చర్చించఉకోవాల్సి మరో అంశం అనుకున్నట్టుగా కాంగ్రెస్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును 5 నెలల కాలంలో పూర్తిచేయగలదా.. అసెంబ్లీ అభిప్రాయ సేకరణ, పార్లమెంట్‌లొ బిల్లు పెట్టడం, నీళ్లు గనులు సరిహద్దులు లాంటి అనేక అంశాల పరిష్కారం ఇలా ఎన్నో సమస్యలతో ముడి పడి ఉన్న ఈ విషయం అంత త్వరగా తేలుతుందా.. దీనికి తోడు ఇప్పటికే కేంద్రం నిర్ణయం పై సీమాంద్ర ప్రాంతం భగ్గుమంది. అక్కడి ప్రజలను ప్రజాప్రతినిధులను ఎలా బుజ్జగిస్తారు. ఇలా ముందు ముందు కాంగ్రెస్ పార్టీ ముందు ఎన్నో సవాల్లు ఉన్నాయి.
అలాగే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ 200 రోజులుగా పైగా పడుతుందని ప్రకటించిన కాంగ్రెస్ ఇప్పుడు నాలుగు నెలలోనే రాష్ట్ర ఏర్పాటు చేస్తామని ఎలా ప్రకటించింది. ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు కాంగ్రెస్ అధినాయకత్వం నుంచి సమాధానం రావాల్సి ఉంది. ఏది ఏమైనా తెలంగాణ పై తేల్చిన కాంగ్రెస్ ఓ చారిత్రాత్మక నిర్ణయం తీసుకునందనే చెప్పాలి.