మ‌జ్లీస్ తెలం'గానం'

 

తెలంగాణ‌ ప్రాంతంలో ఉంటూ కూడా మొద‌టి నుంచి ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తున్న ఏకైక పార్టీ మ‌జ్లీస్ తెలంగాణ ఏర్పాటు అయితే త‌మ ప్రాభ‌వం త‌గ్గడంతో పాటు బిజెపి బ‌ల‌ప‌డుతుంద‌న్న అనుమానంతో తొలి నుంచి ఆ పార్టీ ప్యత్యేక రాష్ట్రన్ని వ్యతిరేఖిస్తూ వ‌స్తుంది. అయితే ఎవ‌రి వ‌త్తిళ్లుకు త‌లొగ్గని అధిష్టానం తెలంగాణ‌ను ప్రకటించేసింది. దీంతో ఇప్పుడు త‌రువాత రాష్ట్రంలో ప‌రిస్థితులు ఎలా ఉండాలి అన్న అంశం పై దృష్టి పెట్టింది మ‌జ్లీస్‌.

తెలంగాణ ప్రాంతంలో ఉంటున్న సీమాంద్రల‌ను సెటిల‌ర్స్ అని పిల‌వ‌కుండా వారి స్వేచ్చకు ఎలాంట భంగం క‌లుగ‌కుండా చూడాల‌ని మ‌జ్లీస్ పార్టీ నేత అస‌దుద్దీన్ ఒవైసీ కోరారు. అలా ఇక్కడి సీమాంద్రల‌కు ర‌క్షణ క‌ల్పించిన నేప‌ధ్యంలో తెలంగాణ‌కు అనుకూలంగా పార్లమెంట్‌లో ఓటు వేసేందుకు సిద్దం అని ప్రక‌టించారు. విభ‌జ‌లన అనివార్యమైనందున తాము కూడా తెలంగాణ రాష్ట్రానికి మ‌ద్దతు ప్రక‌టిస్తున్నామ‌న్నారు.

తెలంగాణ‌తో పాటు దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల డిమాండ్‌ల‌పై కూడా కాంగ్రెస్ దృష్టి పెట్టాల‌న్నారు. గ‌తంలో రాయ‌ల్ తెలంగాణ విష‌యాన్ని తెర మీద‌కు తెచ్చిన మ‌జ్లీస్ భ‌విష్యత్తులో కూడా ఆ అంశం తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశం ఉందంటున్నారు.