అన్నదమ్ముల్లా ఉందాం: కేసిఆర్
posted on Feb 21, 2014 @ 11:35AM
రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో తెలంగాణ వాదులు పెద్దఎత్తున సంబరాలు చేసుకున్నారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసిఆర్ పార్లమెంట్ నుంచి తన నివాసానికి చేరుకున్న సమయంలో పార్టీ నేతలు ఆనందంతో బాణాసంచా పేల్చి తమ సంతోషాన్ని చాటారు. కేసిఆర్ మీడియాతో మాట్లాడుతూ...పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ దృడ సంకల్పతోనె తెలంగాణ కల సహకారమైందని అన్నారు.
ఇది 'ఒక ప్రాంత ఓటమి..మరో ప్రాంత గెలుపు'కాదని అన్నారు. రాష్ట్ర విభజన ఉద్యమంలో ఇరు ప్రాంత మేధావులు, నేతలు మధ్య ఏర్పడిన వైషమ్యాలు మర్చిపోయి ఒకరికి ఒకరు పరస్పరం సహకరించుకుందామని అన్నారు. ఇతర రాష్ట్రాలకు దీటుగా తెలుగురాష్ట్రాలను అభివృద్ధి చేసి, తెలుగు ప్రజలు ఎవరికి తీసిపోరని నిరూపిద్దమని చెప్పారు. హైదరాబాద్ లో ఉన్నవాల్లందరూ మా వాళ్ళే, అందరం కలిసిమెలిసి హైదరాబాద్ ను విశ్వనగరంగా రూపాంతరం చేద్దామని పిలుపునిచ్చారు.