తెలంగాణ కొత్త స్పీకర్ ఎవరంటే?
posted on Dec 7, 2023 @ 12:13PM
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వికారాబాద్ నుంచి విజయం సాధించిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హై కమాండ్ ఖరారు చేసింది. గడ్డం ప్రసాద్ కుమార్ ను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా అధిష్ఠానం నిర్ణయించడంతో దళిత సామాజిక వర్గానికి తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా స్పీకర్ పదవి దక్కినట్లైంది.
తెలంగాణ స్పీకర్‌గా వికారాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన గడ్డం ప్రసాద్ కుమార్ పేరును కాంగ్రెస్ హైకమాండ్ ఖరారు చేసింది. 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లో టెక్స్ టైల్ మంత్రిగా ప్రసాద్ కుమార్ పని చేశారు. తాజాగా కాంగ్రెస్ నిర్ణయంతో దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్పీకర్ పదవిని కట్టబెట్టినట్లయింది.
కొత్త అసెంబ్లీ కొలువు దీరిన తర్వాత సభలో సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెమ్ స్పీకర్ గా ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆ తరువాత ఎమ్మెల్యేలందరూ కలిసి స్పీకర్ ను ఎన్నుకుంటారు. కాంగ్రెస్ హైకమాండ్ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ను ఎంపిక చేయడంతో ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆయనను ఎన్నుకోవడం లాంఛనమే.