టిడిపి రాజ్యసభ అభ్యర్ధులు: గరికపాటి, తోట సీతారామలక్ష్మి
posted on Jan 28, 2014 @ 10:39AM
టిడిపి రాజ్యసభ అభ్యర్ధులుగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు, పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మిలను చంద్రబాబు ప్రకటించారు. వీరిద్దరివీ పార్టీ కుటుంబాలు. 30 ఏళ్ల నుంచి పదవి ఉన్నా లేకపోయినా పార్టీ ఏ బాధ్యత ఇస్తే దానిని తీసుకొని పని చేస్తున్నారని, అలా పని చేస్తున్న కార్యకర్తలు, నాయకులకు పార్టీలో గుర్తింపు, గౌరవం, అవకాశాలు ఉంటాయన్న నమ్మకం కలిగించడానికే వీరిని ఎంపిక చేశామని ఆయన అన్నారు. కాపు సామాజిక వర్గం టిడిపి వైపు మొగ్గు చూపుతోందని, తమ పార్టీలో వారికి తగిన అవకాశాలు ఉంటాయన్న విశ్వాసం, నమ్మకం కలిగించడం కోసం సీతారామలక్ష్మిని ఎంపిక చేశామని చెప్పారు. బిసిలకు ఏ నష్టం లేకుండా కాపులను ఆదుకోవడానికి మేం కృషి చేస్తామని అన్నారు.