గోరంట్లా.. ఉచ్ఛ నీచాలు మరిచావు.. తెలుగుదేశం ఫైర్
posted on Aug 4, 2022 @ 4:53PM
రాజకీయ నాయకునిగా, వైసీపీ ఎంపీగా అందరి మన్ననలు అందుకోవాల్సిన గోరంట్ల మాధవ్ ఊహించని విధంగా చాలా అసభ్యకరంగా దొరికిపోయారు. ఒక మహిళతో మాధవ్ న్యూడ్ వీడియోకాల్ మాట్లాడుతూ న్న క్లిప్పింగ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాధవ్ తీరుపై టీడీపీ నేతలు భగ్గుమంటున్నారు. ఎంపీ పదవికి మాధవ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునేలా ఎంపీ తీరు ఉందని మండిపడుతున్నారు. వీడియో లీక్ కావడంతో వెంటనే మాధవ్‌పై సీఎం జగన్ చర్య లు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ పదవికి ఆయనను అనర్హుడిగా ప్రకటించా లని డిమాండ్ చేశారు. ఓ నిజాయతీ గల పోలీస్ అధికారి నని చెప్పుకుని.. ఆ ప్రచారంతోనే మాధవ్ ఎంపీగా గెలిచారని, కానీ సీఐగా కూడా గోరంట్ల మాధవ్ పై మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయని గుర్తు చేస్తున్నారు. ఎంపీగా కూడా ఆయన తీరు, వైఖరీ మారలేదనడానికి తాజీ వీడియోనే సాక్ష్యమని దుయ్యబడుతున్నారు.
కాగ నెటిజన్లు,యావత్ తెలుగు ప్రజలు ఆయన తీరుపై మండిపడుతున్నారు. కర్నూలు జిల్లాలో మాధవ్ సీఐగా పనిచేస్తున్నరోజుల్లో కూడా ఒక మహిళతో ఇదే విధంగా మాట్లాడారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధ్యత గల ఎంపీగా ఉంటూ ఇలా అసభ్యకరంగా ప్రవర్తిం చ డంపై మహిళా సంఘాలు మండిపడుతు న్నా యి. ప్రజల సమస్యలపై పరిష్కరించాల్సిన ఎంపీ.. మహిళతో రాసలీలలు చేయడం ఏమిటని ప్రశ్నిస్తు న్నారు. కాగా, ఆయన మాట్లాడిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు.
వైసీపీ నేతల తీరును ప్రజలు అసహ్యంచుకుంటున్నారని టీడీపీ నేత బోండా ఉమా అన్నారు. మీడి యాతో మాట్లాడుతూ, సభ్యసమాజం తలదించుకునేలా వైసీపీ నేతల తీరు ఉందన్నారు. అడ్డంగా దొరి కినా ఇంకా గోరంట్ల మాధవ్ బుకాయిస్తున్నారని మండిపడ్డారు. గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని విజయసాయి ట్వీట్ చేయాలని అన్నారు. ఎంపీ గోరంట్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రి జోగి రమేశ్ మహిళా వాలంటీర్లను లైంగికంగా వేధిస్తున్నారని బొండా ఉమ బోండా ఉమా ఆరోపించారు. అలాగే అంబటి రాంబాబు విషయాన్ని కూడా ప్రస్తావిస్తూ అసలు వైసీపీ నేతలెవరికీ మహిళల పట్ల గౌరవం లేదని విమర్శించారు.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన పనితో మహిళా సమాజం సిగ్గుతో తలదించుకుం టోందని టీడీపీ నేత, మాజీమంత్రి పీతల సుజాత అన్నారు. ఎంపీ గోరంట్ల ఓ మహిళతో మాట్లాడిన న్యూడ్ వీడియో కాల్‌పై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ వీడియో కాల్‌కు.. జిమ్‌లో వీడియోకు తేడా తెలియదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మహిళల పట్ల అసభ్యంగా అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్‌పై సీఎం జగన్ నాడు చర్యలు తీసుకుంటే.. ఇవాళ ఎంపీ గోరంట్ల మాధవ్ ఈ విధంగా చేసేవారా? అని అన్నారు. ముఖ్యమంత్రి వెంటనే గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే టీడీపీ మహిళా సత్తా ఏంటో చూపిస్తామని పీతల సుజాత అన్నారు.