సోనియా వద్దకు కోమటిరెడ్డి రాజీనామా లేఖ
posted on Aug 4, 2022 @ 5:32PM
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గురు వారం (ఆగస్టు 4) పార్టీ అధినేత సోనియాగాంధీకి పంపించారు. ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తున్న ట్లు.. ఆ లేఖలో పేర్కొన్నారు.
అలాగే 8వ తేదీన అపాయింట్‌మెంట్ ఇవ్వాల్సిందిగా రాజగోపాల్ రెడ్డి తెలంగాణ స్పీకర్‌ను కోరారు. తన నియోజకవర్గమైన మునుగోడు ప్రజలకు మేలు జరుగుతుందనే నమ్మకంతోటే రాజీనామా చేస్తున్నానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చెప్పారు.
తెలంగాణాలో టీఆర్ ఎస్‌పై కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ చేయలేదని, టీఆర్ ఎస్ అరాచక పాలన పోవాలంటే అది బీజేపీతోనే సాధ్యమన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌కు దూరమయ్యానని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. స్పీకర్ అపా యింట్ మెంట్ తీసుకుని రాజీనామా లేఖను ఆయనకు స్వయంగా అందజేస్తానని వెల్లడించారు.
ఇదిలా ఉండగా, బీజేపీ పక్షాన చేరితే మునుగోడులో ఆ పార్టీ అభ్యర్ధిగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే అందుకు బీజేపీ ఆ నమ్మకం కలిగించాల్సిన అవసరం ఉందని సూచించినట్లు తెలు స్తోంది. తప్పకుండా గెలవగలనని కేంద్రంలో బీజేపీ నేతలు నమ్మితే తప్పకుండా రాజగోపాల్ రెడ్డికి కావ లసిన మద్దతు లభిస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్రమైన దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై తాను స్పందించనని, ఏమైనా ఉంటే రాజగోపాల్‌రెడ్డినే అడగాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు తనను బాధించాయన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.