తమిళనాడులో మద్యం సీసాతో ప్రచారం... వెరైటీ హామీలు..
posted on May 14, 2016 @ 12:48PM
తమిళనాడులో ఇంకా రెండు రోజుల్లో ఎన్నికలు షురూ కానున్నాయి. ఇప్పటికే నేతలందరూ ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో ఒక వ్యక్తి మాత్రం చాలా వెరైటీగా ప్రచారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అంతేకాదు తను ఇచ్చే హామీలు కూడా అంతే వెరైటీగీ ఉన్నాయి. ఇంతకీ అతనెవరంటే.. ఎంఎస్ ఆరుముగం అనే వ్యక్తి అంబత్తూరు శాసనసభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాడు. ఈయన తమిళనాడు మద్యం సేవన ప్రియుల అవగాహనా సంస్థకు చెందిన వ్యక్తి. ఈయన ఎన్నికల గుర్తు కూడా మద్యం సీసానే. ఈ నేపథ్యంలోనే ఆరుముగం.. తన ప్రచారంలో కూడా మందు సీసాను తలపై పెట్టుకొని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఆయన ఇస్తున్న హామీలపై కూడా ఓ లుక్కేయండి..
1. మద్యం మహమ్మారికి భర్తను కోల్పోయిన మహిళలకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి.
2. మద్యం సేవించి తండ్రిని కోల్పోయిన పిల్లలకు 21 యేళ్ళ వరకు విద్య ఉపాధి ప్రాధాన్యత ఇవ్వాలి.
3. మద్యం కారణంగా కన్నబిడ్డను కోల్పోయిన తల్లిదండ్రులకు నెలకు రూ.3 వేల నగదు సాయం చేయాలి.
మరి ఈ హామీలు సామాన్య ప్రజలకు నచ్చుతాయో లేదో తెలియదు కానీ.. మందు బాంబులకు నచ్చుతాయేమో..