కన్యా కుమారి పేరు మారింది.. ఇక నుండి కన్నియా కుమారి
posted on May 14, 2016 @ 12:31PM
తమిళనాడులో ఉన్న కన్యాకుమారి పేరు అందరికి తెలిసిందే. అయితే ఇక నుండి కన్యాకుమారి పేరు కాస్తా కన్నియా కుమారి పేరుగా మారనుంది. కన్యాకుమారి పేరు కన్నియా పేరుగా ఉంచాలంటూ ఆ ప్రాంత వినియోగదారుల హక్కుల సంఘ అధ్యక్షుడు పోరాటం చేయగా.. చివరికి విజయం సాధించారు. కన్యా కమారిని.. కన్నియా కుమారిగా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే కన్యా కుమారి అసలు పేరు కన్నియా కుమారినే. అయితే బ్రిటిష్ పాలకుల సమయంలో వారు కన్నియా కుమారిని కాస్త కన్యా కుమారిగా ఉచ్చరించడంతో ఆ పేరు అలాగే స్థిరపడిపోయింది. వాడుక బాషలో కన్యా కుమారిగా ఉన్నా.. కేంద్ర ప్రభుత్వం, రైల్వేశాఖల్లో మాత్రం కన్నియా కుమారిగానే ఉంది. అక్కడ రైల్వేస్టేషన్లలో ఏర్పాటు చేసిన బోర్డులతో పాటు టిక్కెట్ల పంపిణీలో కూడా కన్నియా కుమారి అనే రాసేవారు. దీంతో వినియోగదారుల హక్కుల సంఘం అధ్యక్షుడు కన్యా కుమారి అసలు పేరైనా కన్నియా కుమారి పేరునే ఉంచాలని కోరడంతో.. కేంద్రం నుండి ఆదేశాలు వచ్చిన వెంటనే కన్యాకుమారిగా పేరును తొలగించి, కన్నియాకుమారి బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో కన్యాకుమారిగా పాపులర్ అయిన ఈ ఊరు పేరు ఇక నుంచి కన్నియా కుమారిగా మారింది.