టీ-20 టిక్కెట్ల కోసం తొక్కిసలాట ఒకరి మృతి
posted on Sep 22, 2022 @ 12:26PM
చాలాకాలం తర్వాత హైదరాబాద్‌లో జరగనున్న టీ-20 క్రికెట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకాలు తొక్కిసలాట, కొట్లా టలు, లాఠీచార్జ్, ఒక మహిళ మృతికీ దారితీసింది. ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్ వేదిక గా జరగ నున్న టీ20 క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు గురువారం నుంచి మొదలుకానున్నట్లు హైదరా బాద్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జంఖానా గ్రౌండ్‌లో టికెట్ల అమ్మకాలకు కౌంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు హెచ్‌సీఏ ప్రతినిధులు తెలిపారు. కానీ టిక్కెట్ల కోసం జనం గురువారం తెల్లవారుజామునుంచే క్యూకట్టారు.
ఒక వ్యక్తికి రెండు టికెట్లు మాత్రమే విక్రయించడం జరుగుతుందని, టికెట్లు కొనేవారికి ఆధార్ కార్డు తప్పనిసరి అని హెచ్‌సీఏ స్పష్టం చేసింది. గత కొన్ని రోజులుగా మ్యాచ్ టికెట్ల అమ్మకాలపై అభిమానుల్లో గందర గోళం నెలకొంది. ఫ్యాన్స్ డిమాండ్‌తో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ దిగిరాక తప్పలేదు. టీ - 20మ్యాచ్ టికెట్ల కోసం క్రికెట్ అభిమానులు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ వద్ద ఆందో ళన చేపట్టారు. సెక్యూ రిటీ సిబ్బంది లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారి తీసింది. జనం పరు గులు, తొక్కిసలాటలో ఒక మహిళ తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ఆమె మరణించింది.
మ్యాచ్ టికెట్లు సికింద్రాబాద్ జింఖానా హెచ్‌సీఏ కార్యాలయంలో మంగళవారం నుంచి లభిస్తాయని సోష ల్ మీడియాలో వైరల్ కావడం తో నగరంతో పాటు, వివిధ జిల్లాల నుంచి క్రికెట్ అభిమానుల తెల్ల వారు జాము నుంచే గ్రౌండ్ వద్ద బారులు తీరారు. సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేయడంతో గోడ దూకి లోపలికి దూసుకెళ్లారు. సెక్యూరిటీ గార్డులు లాఠీలకు పని చెప్పడంతో ఎక్కడి వాళ్ళు అక్కడ చెల్లా చెదురై బయటికి పరుగులు తీశారు. దీంతో రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు రంగ ప్రవే శం చేసి ట్రాఫి క్‌ను క్లియర్ చేశారు.
చాలాకాలం తర్వాత టీ-20 మ్యాచ్‌ని అదీ భా రత్, ఆసీస్‌ల మధ్య మ్యాచ్‌ని ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన గొప్ప అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడం అభిమానులు ఇష్టపడరు. టికెట్ల కోసం విరుచుకు పడ్డారు. క్రికెట్ మ్యాచ్ టికెట్ల అమ్మకాల విషయంలో సంబంధిత అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకో లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆదివారం జరిగే మ్యాచ్‌కి టికెట్ల అమ్మకం విషయంలో ముందుగానే తగిన ఏర్పాట్లు తీసుకోలేదన్నది గురువారం జింఖానా గ్రౌండ్స్‌లో తొక్కిసలాట, కుమ్మ లాట, యువకులు గాయపడటం మరింత స్పష్టం చేసింది.