మరోసారి సాయిబాబాపై స్వరూపానంద స్వామి సంచలన వ్యాఖ్యలు
posted on Oct 19, 2016 @ 12:58PM
షిర్డీ సాయిపై ద్వరకా పీఠాధిపతి స్వరూపానంద స్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శాస్త్ర ప్రమాణాలు లేకుండా సాయిబాబాను ఎలా పూజిస్తారు..? కృష్ణుని స్థానంలో పిల్లనగ్రోవిని పట్టుకున్న సాయిని ఎలా కొలుస్తారు? అని ఆయన ప్రశ్నించారు. సాయి విగ్రహాలు, ఫొటోలు పెట్టి హిందువులు ఆరాధిస్తున్నారు..సాయిని దేవునిగా పూజించడ శోచనీయం.. సనాతన హిందూ దర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.. బావుద్దీన్ కొడుకు అయిన సాయి అసలు పేరు చాంద్ మియా.. సాయి బతికి ఉండగా అతను ఎవరో చాలా మందికి తెలియదు.. చనిపోయిన తరువాత ఆయన్నే దేవునిగా పూజిస్తున్నారు.. ప్రజలు విష్ణుమూర్తిని పూజించవచ్చు కానీ సాయిబాబాను కాదు అని చనిపోయిన వ్యక్తిని పూజించాడన్ని రామ్ చరిత్ మానస్ లో తప్పుబట్టారు. హిందూ బాలలకు పాఠశాలల్లో రామాయణం, గీత గురించి చెప్పాలి.. అప్పుడే మహిళలపై దాడులు తగ్గుతాయి..మమ్మల్ని విభేధించేవారు చర్చించవచ్చు కానీ.. మాతో గొడవలెందుకు అని అన్నారు. కాగా గతంలో ఆయన సాయిబాబాపై పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సాయి భక్తులు పెద్ద సంఖ్యలో ఆయనపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు దీనిపై ఎంత దుమారం రేగుతుందో చూడాలి.