అమెరికా అధ్యక్ష బరిలో మూడో వ్యక్తి... క్లంప్..
posted on Oct 19, 2016 @ 12:36PM
అమెరికా అధ్యక్ష బరిలో ఇప్పటి వరకూ రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్ధి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అధ్యక్ష అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ మాత్రమే ఉన్నారని తెలుసు. అయితే ఇప్పుడు ఈ రేసులో మరో వ్యక్తి కూడా వచ్చి చేరారు. ఆ వ్యక్తి పేరు క్లంప్. అదేంటి అనుకుంటున్నారా.. అయితే ఈ క్లంప్ ను సృష్టించింది వివాదాల వర్మ రాంగోపాల్ వర్మ. వచ్చే నెలలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీని గెలిపించాలా, లేక ట్రంప్‌ను గద్దె ఎక్కించాలా అన్న కన్ఫ్యూజన్ లో అమెరికన్లు ఉన్నారు.. వీరిద్దరికీ కాకుండా క్లంప్ కు ఓటేయ్యండి అంటూ ఆయన ఓ ఫొటో పోస్ట్ చేశారు. ఇంతకీ క్లంప్ ఎవరనుకుంటున్నారా.. ట్రంప్, హిల్లరీ ఫొటోలను కలిపి రూపొందించిన చిత్రాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘‘ఎవరికి ఓటెయ్యాలా అని కంఫ్యూజ్ అవుతున్న అమెరికన్ల కోసం ట్విట్టరూన్ మరో అభ్యర్ధిని రూపొందించింది. అతనే క్లంప్. అంటే క్లింటన్, ట్రంప్ అన్నమాట’’ అంటూ ట్వీట్ చేశారు వర్మ.