Read more!

రేవంత్ రెడ్డిని కల్సిన దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 

నటుడు, రచయిత, సంగీతం, దర్శకత్వం ఇలా చిత్ర రంగంలో  పలు క్రాప్ట్ లలో పరిచయం ఉన్న వ్యక్తి  అంటే ఠక్కున గుర్తొచ్చేది ఎస్ వి కృష్ణారెడ్డి. చిత్రరంగంలో వేషాలకోసం మద్రాసు వెళ్లిన అతనికి అవకాశాలు రాకపోవడంతో స్నేహితుడైన అచ్చిరెడ్డి నిర్మాతగా  మారిపోయారు. ఆయన నిర్మాతగా ఉన్న సినిమాలకు ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడై విజయవంత చిత్రాలను అందించారు. 
ప్రముఖ సినీ నిర్మాత అచ్చిరెడ్డి, టాలీవుడ్ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డిలు శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి పలువురు సినీ ప్రముఖులు ఆయనను కలుస్తున్నారు. గతంలో టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, నిర్మాత దిల్ రాజు తదితరులు కలిశారు.