యుద్ధం వస్తే భారత్ దే గెలుపు... తెల్చి చెప్పిన అమెరికా
posted on Sep 30, 2016 @ 10:45AM
ప్రస్తుతం భారత్-పాక్ సరిహద్దుల్లో యుద్ద వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. పాక్ చేసిన ఉరి దాడికి ప్రతీకారంగా మన దేశం పాక్ ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ దాడులు జరిపి నలభైమంది ముష్కరులను మట్టుబెట్టింది. దీంతో పాక్ కూడా భారత్ పై దాడులకి దిగడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భారత్ కూడా యుద్దానికి సై అంటుంది. అయితే ఇప్పుడు అది మరింత ఉద్రిక్తంగా మారితే గెలుపెవరిది... ఈప్రశ్నకు అమెరికా వర్గాలు సమాధానం చెబుతున్నాయి. ఒకవేళ యుద్దం తీవ్రతరంగా మారితే రెండు దేశాల మధ్య ఉన్న సైన్యం, ఆయుధాలు బట్టి చూస్తే భారత్ దే గెలుపు అని చెబుతున్నారు అమెరికా గూఢచార సంస్థ సీఐఏ అధికారులు. వారి తెలిపిన వివరాల ప్రకారం.. ఎవరెవరి దగ్గర ఎన్ని ఆయుధాలు ఉన్నాయో ఒకసారి చూద్దాం..
* భారత్ వద్ద 13,25,000 మందితో బలమైన సైన్యం ఉండగా, దాయాది పాకిస్థాన్ సైన్యం 6.20 లక్షలు మాత్రమే ఉంది.
* భారత్ రిజర్వ్ సైన్యం 21.43లక్షలు కాగా పాకిస్థాన్‌ది 5.15 లక్షలు.
* యుద్ధ విమానాలు భారత్ వద్ద 2,086 ఉండగా పాకిస్థాన్ వద్ద అవి 923 మాత్రమే ఉన్నాయి.
* హెలికాప్టర్లు భారత్ వద్ద 646 ఉండగా పాక్ వద్ద కేవలం 306 మాత్రమే ఉన్నాయి.
* అటాక్ హెలికాప్టర్ల విషయంలో మాత్రం మనకంటే పాకిస్థాన్ మరింత మెరుగ్గా ఉంది. ఇవి భారత్ వద్ద 19 మాత్రమే ఉండగా దాయాది వద్ద 52 ఉన్నాయి.
* అటాక్ ఎయిర్ క్రాఫ్ట్‌ల విషయంలో మాత్రం మనదే పైచేయి. మన వద్ద 809 ఉన్నాయి. పాకిస్థాన్ వద్ద 394 మాత్రమే ఉన్నాయి.
* ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్‌లు భారత్ వద్ద 679, పాక్ వద్ద 304 ఉన్నాయి.
* ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్‌లు మనవద్ద 857 ఉండగా శత్రుదేశం వద్ద 261 ఉన్నాయి.
* యుద్ధ ట్యాంకుల విషయంలోనూ దాయాది కంటే మనదే పైచేయి. మనవద్ద అవి 6,464 ఉండగా పాక్ వద్ద 2,924 మాత్రమే ఉన్నాయి.
* ఆర్మ్‌డ్ ఫైటింగ్ వాహనాలు భారత్ వద్ద 6,704, పాక్ వద్ద 2,828 ఉన్నాయి.
* విమాన వాహక నౌకలు మనవద్ద రెండు ఉండగా పాక్ వద్ద అసలు లేవు.
* మన వద్ద యుద్ధనౌకలు 295 ఉన్నాయి. పాక్ వద్ద 197 ఉన్నాయి.
* జలాంతర్గాములు భారత్ వద్ద 14 ఉండగా పాకిస్థాన్ వద్ద 5 ఉన్నట్టు సీఐఏ గణాంకాలు చెబుతున్నాయి.