Read more!

కిరణ్ కి కలిసి వచ్చే విభజన విచారణ

 

ఎన్నికల అనంతరం జూన్ 2న ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలు విడిపోయేందుకు అధికారికంగా ముహూర్తం కూడా ఖరారు అయినప్పటికీ, ఇంకా నేటికీ రాష్ట్ర విభజన వ్యవహారం సుప్రీంకోర్టులో నలుగుతూనే ఉంది. మాజీ సీయం.కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు విభజనను వ్యతిరేఖిస్తూ వేసిన పిటిషన్లపై సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్ఎల్ దత్తు నేతృత్వంలోని డివిజన్ బెంచ్ మే 5న విచారణ చెప్పట్టనుంది. అంతకు ముందు ఈ అంశంపై సంజాయిషీ కోరుతూ సుప్రీంకోర్టు నుండి నోటీసులు అందుకొన్న కేంద్ర ప్రభుత్వం విభజనను, అది జగిరిగిన తీరుని, అందుకు తనకు గల హక్కులను గట్టిగా సమర్దించుకొంది. రాష్ట్ర విభజన వ్యతిరేఖిస్తూ పడిన అనేక పిటిషన్లను ఇదివరకు త్రోసిపుచ్చిన జస్టిస్ దత్తు బెంచే ఈ సారి కూడా విచారణ చెప్పట్టబోతోంది. కనుక ఈసారి కూడా ఈ పిటిషన్లను కొట్టివేయవచ్చును. పైగా ఇప్పుడు రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో కూడా మళ్ళీ చాలా ఏళ్ల తరువాత పూర్తి ప్రశాంత వాతావరణం ఏర్పడి ఉంది. ప్రజలు, పార్టీలు అందరూ కూడా మానసికంగా విభజనకు సిద్దపడి ఉన్నారు. కనుక ఇటువంటి పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మళ్ళీ ఈ సమస్యను కెలికేందుకు అంగీకరించక పోవచ్చును.

 

కానీ, ఇదే సమస్యను ఆధారంగా చేసుకొని జై సమైక్యాంధ్ర పార్టీ స్థాపించి ఏటికి ఎదురీదుతున్న కిరణ్ కుమార్ రెడ్డికి మాత్రం ఈ కోర్టు, విచారణ వ్యవహారం ఎన్నికల ప్రచారానికి వాడుకొనేందుకు మాత్రం ఉపయోగపడవచ్చును. బహుశః నేడో రేపో కిరణ్ ఈ అంశాన్ని పట్టుకొని మళ్ళీ మీడియా ముందుకు వచ్చినా ఆశ్చర్యం లేదు.