Read more!

చంద్రబాబు మాట వినని బాలకృష్ణ

 

 

 

నందమూరి బాలకృష్ణ ఈ ఎన్నికలలో పోటీ చేయాలని ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నాడు. ‘లెజెండ్’ హిట్ కావడంతో బాలకృష్ణ ఆత్మవిశ్వాసం బాగా పెరిగిపోయింది. ఈసారి ఎన్నికలలో తప్పనిసరిగా పోటీ చేయాల్సిందేనని బాలకృష్ణ గట్టి పట్టుదల మీద వున్నాడు. రాయలసీమ టూర్‌కి వెళ్ళినప్పుడు హిందూపూర్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించేశాడు. అక్కడి తెలుగుదేశం కార్యకర్తలకు తన నామినేషన్ వ్యవహారాల గురించి చర్చించినట్టు సమాచారం. అయితే హైదరాబాద్ తిరిగొచ్చాక బాలకృష్ణ ఉత్సాహం మీద చంద్రబాబు నీళ్ళు కుమ్మరించాడు.

 

బాలకృష్ణ అసెంబ్లీకి నిలబడి గెలిస్తే సీమాంధ్ర ముఖ్యమంత్రి పదవికి తనకు పోటీ అవుతాడని భయపడ్డాడో లేక మరే కారణం వుందో గానీ, బాలకృష్ణ పోటీ చేసే విషయంలో చంద్రబాబు  సుముఖంగా కనిపిచండం లేదు. ఆ విషయాన్నే ఆయన విలేకరులకు చెప్పారు. బాలకృష్ణ హిందూపూర్ నుంచి పోటీ చేస్తాడట కదా అంటే, ఆ విషయాన్ని ఇంకా ఆలోచించలేదు బాలకృష్ణతో మాట్లాడి  చెబుతానని అనడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.



ఆ తర్వాత చంద్రబాబు, బాలకృష్ణ మధ్య హాట్ హాట్ చర్చ జరిగినట్టు తెలుస్తోంది. నువ్వు పోటీ చేయొద్దు బావా.. నువ్వు రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తే అదిరిపోతుందని చంద్రబాబు బాలకృష్ణని ఉబ్బేసినా బాలకృష్ణ బుట్టలో పడనట్టు తెలుస్తోంది. ఈసారి ఆరు నూరైనా తాను పోటీ చేయడం ఖాయమని చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు సమాచారం. చంద్రబాబు బాలకృష్ణని ఎంత వెనక్కి లాగాలని ప్రయత్నించినా బాలకృష్ణ తన పట్టు విడవనట్టు తెలుస్తోంది.