అటు రాజకీయం,ఇటు క్రికెట్. .. కుట్రలు, వివాదాలు!
posted on Oct 13, 2022 @ 3:29PM
వివాదాలు, కక్షపూరిత చర్యలు, వ్యాఖ్యానాలు ఏ రంగంలోనైనా స్నేహవాతావరణాన్ని దెబ్బతీస్తాయి. ఇం దుకు రాజకీయాలే కానక్కర్లేదు, క్రీడారంగం అందుకేమీ మినహాయింపూ కాదు. రాజకీయాల్లో అధికార, విప క్షాల నాయకులు, అభిమానులు, అనుచరుల మధ్య ఉండే గొడవలు, వివాదాలు, దాడుల గురించి దాదా పు రోజూ వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. ఇలాంటివి ఇటు క్రీడారంగంలోనూ ఉన్నాయి. అయితే ఇవి పెద్దగా తెరమీదకి రావు. అంతా తెర వెనుక రాజకీయాలు, కుట్రలే ఎక్కువ. ఎవరు ఎవర్ని సమర్ధిస్తు న్నారు, ఎవర్ని ఎవరు పైకి రావడంలో అడ్డుకుంటున్నారన్నది చూచాయిగానే తెలుస్తుంది గాని వెంటనే బయటపడదు. కానీ దాని ప్రభావం ఎంతో ఉంటుంది. ఒకరి అభివృద్ధి మరొకరికి కంటకింపుగా ఉండడం అనేది కేవలం రాజకీయరంగానికే పరిమితం కాదు.
చాలాకాలం నుంచి క్రీడారంగంలో ముఖ్యంగా అందరికీ ఇష్టమైన ఎంతో కొంత అవగాహన ఉన్న క్రికెట్‌లో నూ చిత్రమైన రాజకీయాలు జరుగుతున్నాయి. భారత క్రికెట్ బోర్డు, సెలక్షన్ కమిటీల మీటే చివరి మాట అవుతుంది. కనుక అందులో అధికారికంగా రాజ్యం ఏలడం దేశంలో క్రకికెట్‌ను ఏలడంతో సమానం. అం దునా అంతులేని ధనప్రవాహంతో సాగిపోయే క్రికెట్‌లో ఇది చాలా సీరియస్‌గానే ఆటకు దెబ్బతీస్తు న్నద న్న అభిప్రాయాలూ ఉన్నాయి. ఇందులోకి రాజకీయ నాయకుల ప్రవేశంతో మరింత ఆసక్తి కరంగా మారిం ది. ఒకరిని గద్దె దింపడానికి కొందరు ఎమ్మెల్యేలను, మంత్రులను తన దారిలోకి తెచ్చుకుని వారితో యు ద్ధం ప్రకటించి అధిష్టానానికి సవాలు విసరడమో, ప్రభుత్వం కొనసాగేందుకు బలం సరిపోదని అసెం బ్లీలో బలపరీక్షపెట్టేంతవరకూ లాక్కెల్లడం, ఆనక అధికారం చేజిక్కించుకోవడం ఇటీవలే మహారాష్ట్రలో చూశాం. ఉద్దవ్ ఠాక్రేను గద్దె దింపడంలో అధకారం చేజిక్కించుకోవడంలో ఏక్‌నాథ్ షిండే వేసిన ఎత్తుగడ అసమాన్యం. శివసేనలో ఉండి శివసేననే చీల్చిన మహాశక్తిగా, ఉద్ధవ్‌కు ఊహించని షాక్ ఇచ్చిన వీరుడిగా షిండే వర్గం పేర్కొన్నది. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో గొప్ప మలుపుగా పేర్కొన్నారు.
తాజాగా క్రికెట్ బోర్డు అధ్యక్ష పదవి నుంచి దాదా సౌరవ్ గంగూలీ పదవీ కాలం అయిపోయినా దిగడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు. పైగా అతను ఐసిసి పదవికి అవకాశం వచ్చినా వదులుకోవడానికే సిద్ధపడు తున్నాడు. కారణం ఇక్కడ ఆధిపత్యం చెలాయించే అవకాశం చేజారిపోతుందని. దేశంలో క్రికెట్‌ను కేవలం ప్లేయర్‌గానే కాదు అధికారిగా కూడా తన యుక్తితో చెలాయించాలన్న ఆలోచన ఎంతవరకూ సబబు అన్నది క్రికెట్ పండితులు ఆలోచిస్తున్నారు. గంగూలీ ఆలోచన వెనుక బీజేపీ వారి మద్దతు ఉందన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. బోర్డు కార్యదర్శిగా ఉన్న జై షా కి గంగూలీకి ఉన్న స్నేహం అటువంటిది. కానీ దాదాను మరో సారి అధ్యక్ష పదవిలో చూడాలని బోర్డు సభ్యులు, క్రికెట్ అధికారుల్లో చాలామంది పెద్దగా అనుకోవడం లేదు. అలాగే అతను ఐసిసికి వెళ్లడానికి కొందరు పెద్దలు అడ్డుపడు తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజానిజాలు తేలవలసి ఉంది. బోర్డు అధ్యక్షునిగా తననే కొనసాగిస్తారనే ఆలోచనలోనే నామినేషన్ వేయలేదు. కానీ రోజర్ బిన్నీని ఏకగ్రీవం చేసే పరిస్థితు లు ఏర్పడడంతో అవమానంతో గంగూలీ మొహం ఎర్రబడింది. అయితే దాదాకి రాజకీయాలు అంతగా ఇష్టం లేదు గనుక బీజేపీ పంచన చేరడానికి పెద్దగా సుముఖంగా లేడన్నది బయటపడటంతోనే అతనికి ఈ అవమానం ఎదురయిందన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
తమిళనాడులో ప్రధానప్రతిపక్షం అన్నాడిఎంకే స్థాపించబడి యాభయి సంత్సరాలవుతోంది. ఈ తరు ణంలో ఆ పార్టీలో విభేదాలు తెరమీదకి వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి ఇ.కె.పళని స్వామి పార్టీ పగ్గాలు పట్టే అవకాశం చేజిక్కించుకున్నారు. తన మాజీ డిప్యూటీ ఓ.పన్నీర్ సెల్వం పార్టీ పదవి నుంచి తప్పు కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమిళనాడులో వేగంగా జరిగిపోతున్న రాజకీయాపరిణామాల్లో ఇపి ఎస్ అంతకంటే వేగంగా పావులు కదిపి తన మాజీ డిప్యూటీకి చుక్కలు చూపించారు. దీంతో ఇక ఓపీ ఎస్ పక్కక తొలగించాల్సిందే. అయితే దీనితో అన్నా డిఎంకెలో విస్పోటం అంత త్వరగా ఉండకపోవచ్చు. గతంలో ఎం.జి.రామచంద్రన్ డిఎంకె నుంచి విడిపోయి ఏడిఎంకే (తర్వాత ఇదే ఏఐఏడిఎంకె అయింది) ని 1972 అక్టోబర్‌లో పెట్టారు. అప్పటికి ఆయన తమిళ సినీరంగాన్ని ఏలుతున్నారు. కానీ రాష్ట్ర సిఎం డిఎంకె అధ్యక్షుడు కరుణానిధి ఎంజీఆర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దీన్ని తట్టుకోలేక ఎంజీఆర్ వీరాభిమాని ఒకరు ఉదుంమల్‌పేట్ లో ఆత్మాహుతికి పాల్పడి ప్రాణాలు తీసుకున్నాడు.
ఇలాంటి సంఘటనలు ఇటు క్రికెట్‌లోనూ చోటు చేసుకుంటూన్నాయి.. అనాదిగా. చాలాకాలం నుంచి క్రికెట్ విషయంలో అందరికీ తెలిసిన సంగతి కేవ లం ముంబై ప్లేయర్లకే టీమ్ ఇండియాలోకి వెళ్లే అవ కాశాలు కల్పించడం, లేదా దక్కెట్టు కొందరు సహక రిం చడం. ఇందుకు గవాస్కర్ వంటి సూపర్ స్టార్లు కూడా పాత్ర వహిస్తున్నారన్న వివాదాస్పద వ్యాఖ్యలు ఉన్నాయి. దీని మీద చాలాకాలం చర్చ జరిగింది. కారణం లేకపోలేదు, ముంబై కాకుండా వేరే ప్రాంతాల నుంచి ముఖ్యంగా యుపి, బీహార్, తమిళనాడు నంచీ వచ్చినవరిని హేళన చేయడం, ఆటను విమర్శించడం అనేది జరుగుతూనే ఉంది. సచిన్ కోసం కొందరి అవకాశాలు దెబ్బతిన్నాయన్నది అప్పట్లో ప్రచారమయింది. సచిన్ , కాంబ్లే కాంబినేషన్‌లో మహారాష్ట్ర, ముంబైలో అద్బుత క్రికెట్ చూసినవారంతా వారిని టీమ్ ఇండియాకి తీసుకున్నారు. క్రమేపీ కాంబ్లీ వెనకబడటం జరిగింది. అప్పటికి గంగూలీ విజృంభిస్తుండడంతో ఓపెనర్‌గా సచిన్‌తో జతకట్టాడు. ఇది తప్పని పరిస్థితి కావడంతో దాదాను నిలువరించే ప్రయత్నాలు జరగలేదు.
కానీ అంతకు ముందు, తమిళనాడు నుంచే వెళ్లిన కె.శ్రీకాంత్ ఇటువంటి అవమానాలు చాలా పడ్డాడని అనాలి. అతనే ఓపనర్ కావడం ముంబై వారికి నచ్చలేదు. అతనిలో చిత్ర మైన టెక్నిక్ ఉండడం పరు గులు సాధించడం ఇతరుల్లో కనపడదు. అందువల్ల ముంబై వారికి అతన్ని మూడో స్థానానికి దించే ప్రయ త్నాలే చేశారు. అతనికి ఆడటం తప్ప ఇలాంటి రాజకీయాలు తెలీవు గనుక రాణించి నిలబడ్డాడు. చిత్ర మేమంటే 1983 ప్రపంచకప్ విజేత జట్టు కెప్టెన్ టీమ్ ఇండియా విజయంలో కీలకపాత్ర వహించిన కపిల్ దేవ్‌ను ముంబైప్లేయర్లు దారుణంగా అవమానించేవారని అప్పట్లో వార్తలు విన బడేవి. కపిల్ వాటికి తన ఆటతో ధీటుగా సమాధానం చెప్పేడు. చాలా చర్చల్లో అతన్ని అవ మానించడం కూడా జరిగింది.
అనిల్ కుంబ్లే 2016 లో టీమిండియా కోచ్‌గా ఎన్నికయ్యాడు. కోహ్లీ, కుంబ్లేల మధ్య వివాదం ఆస్ట్రేలియా భారత పర్యటనతో ప్రారంభమైంది. టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ గాయం కారణంగా ఆడలేదు. అజింక్యా రహానే జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ, జట్టు ఎంపికలో మా త్రం కోహ్లీ జోక్యం చేసుకున్నాడు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ విషయంలో కుంబ్లేతో గొడవ పడ్డా డు. ధర్మశాల టెస్టులో కుల్దీప్‌కు చోటు ఇవ్వాలా వద్దా అన్న విషయమై ఇద్దరి మధ్య వివాదం చెల రేగిం ది. అయితే, కుల్దీప్ అరంగేట్రం చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను ఎనిమిది వికెట్ల తేడాతో ఓడించింది. ఇక్కడ నుంచి విరాట్, కుంబ్లేల మధ్య వివాదం వార్తల్లో కూడా నిలి చింది. ఇది కాకుండా అప్పటి బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించాలని, జహీర్ ఖాన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించాలని కుంబ్లే కోరుకున్నాడు.ఈ వివాదం కారణంగా 2017 లో కుంబ్లే తన పద వికి రాజీనామా చేశారు. అయితే ఈ వివాదాన్ని కోహ్లీ నిరంతరం ఖండిస్తూనే ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కూడా కోహ్లీ అదే పని చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో, భారత్ తన ప్రత్యర్థి పాకి స్థాన్‌తో ఓడిపోయింది. దీని తర్వాత, భారత టీం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. కుంబ్లే లేకుం డా కరేబియన్ దేశానికి బయలుదేరింది. కుంబ్లే గైర్హాజరు విషయంపై మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, కుంబ్లే ఐసీసీ క్రికెట్ కమిటీకి అధిపతిగా ఉన్నందున, దాని సమావేశం కోసం ఆగి పోయాడంటూ బీసీసీఐ కవర్ చేసింది. అయితే కుంబ్లే తన పదవికి రాజీనామా చేయడంతో అసలు విష యం బయటకు పొక్కింది. కుంబ్లే తన రాజీనామాలో కోహ్లీతో విభేదాలను పేర్కొంటూ బీసీసీఐకి లేక సర్పించాడు. దీంతో బీసీసీఐ రవిశాస్త్రిని హెచ్ కోచ్‌గా నియమించింది.
అసలు జట్టు ఎంపిక విషయంలోనే అన్ని మతలబులూ జరుగుతాయి. తనవారు, ఇత రులు అనే కోణం ఇక్కడ బాగా ప్రదర్శితమవుతుంటుంది. చాలామంది ఢిల్లీ, ముంబై ప్లేయర్లు చిన్న తనం నుంచీ అక్కడి పరిస్థితులు సహకరించడంతో ఆటలో ముందడుగు వేసి సెలక్టర్ల దృష్టిలో పడడం టీమ్ ఇండియా తలు పులు తట్టడానికి వీలుంటుంది. కానీ దక్షిణాది, ఉత్తరాది ప్లేయర్లు నానా అవస్థాపడి ఆ మెట్లెక్కే సమయా నికి ఆట్టే కాలం ఆడలేని శరీరధారుడ్యమూ కలిగి ఉండరు. అనేక అడ్డంకులు, నిబంధనల కారణంగా చాలామంది వెనకబడిపోతున్నారు. అందుకే ప్రొఫెషనల్‌గా రావడానికి ఈతరం వారిలో చాలామంది ఉత్త రాది రాష్ట్రాలకు తరలిపోతున్నారు. అందుకు పెద్ద ఉదాహరణ రాయుడు. ఎంత బాగా ఆడినా, గొప్ప ప్లేయర్‌గా అందరి దృష్టిలో పడినా సెలక్టర్లు లైట్ తీసుకోవడం దారుణం. ఇదే చాలాకాలం నుంచి జరు గుతోంది. అయితే సచిన్ తరం ప్లేయర్లు రిటైర్ కావడం, ధోనీ లాంటి ఝార్ఖండ్ ప్లేయర్ ఉద్భ వించడంతో ముంబై ప్రాభవం తగ్గింది. అందరూ ధోనీ భజన ధోనీ లాంటి ప్లేయర్ల అవస రాన్ని అప్పుడే గ్రహించినట్టు నటిస్తూ వచ్చారు. ఢిల్లీ ప్లేయర్ ఓపెనర్ సెహ్‌వాగ్‌ని ఒక టెస్ట్‌కి ధోనీ కూచో బెట్ట డంతో ముంబై కార్లంతా దేశంలో పెద్ద చర్చ లేవదీశారు. కానీ ధోనీ మాత్రం అధికారులకు నచ్చజెప్పి తన మాటే నెగ్గించుకున్నాడు. అలా జట్టులోకి ఉత్తరప్రదేశ్, కర్ణాటకా వారికి అవకాశాలు దక్కాయి. ఇది సరిగ్గా పార్టీ రాజకీయాల్లో చదరంగం ఆడి అధ్యక్షస్థానాన్ని చేజిక్కించుకునే రాజకీయ లోకల్ లీడర్ల వ్యవహారం లాటిదే!