స్టూడెంట్ కోతి!
posted on Sep 17, 2022 5:51AM
పిల్లవాడు బాగా అల్లరి చేస్తు న్నాడని, నిమిషం కుదురులే కుండా ఉన్నాడని బడిలో వేశారు. అక్కడ బాగా అల్లరి చేస్తున్నాడని, మీవాడు మరీ కోతిలా తయారయ్యాడని టీచర్ ఆ పిల్లవాడి తల్లికి ఫోన్ చేసి మరీ చెప్పింది. మీ వాడిని మీరు అదుపులో పెట్టా లని, మాట అస్సలు వినడం లేదని ఫిర్యాదు చేసింది. మనం చేసే పిచ్చి పనులన్నిటికీ కోతిని ఉదాహరణగా తీసుకుని దాన్ని అవమాని స్తున్నామనుకోం. కానీ జార్ఖండ్‌లో ఒక కోతి మాత్రం అవేమీ పట్టించుకోకుండా చక్కగా రోజూ ఓ క్లాసులో బుద్ధిగా కూచు ని పాఠాలు వింటోంది.
మొదట క్లాసులో పిల్లలు భయంతో ఒణికారు. కానీ క్రమేపీ ఏది ఈ కోతి ఇంకా రాలేదే అని ఎదురుచూస్తున్నారు, టీచర్‌తో సహా! పుస్తకాలు, పెన్నులు, పెన్సిలు, కంపాస్ బాక్స్ ఏమీ లేకుండా క్లాసులోకి చాలా వినయంగా వచ్చి ఏదో ఒక వరుసలో టీచర్‌కి కనిపించేలా కూచుని శ్రద్ధగా పాఠాలు వింటోంది. మనోడు కంటే ఇదే నయం మావా! అనుకున్నారు చాలామంది.
పిల్లలే బుద్ధిగా స్కూల్‌కు వెళ్లరు. కానీ అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే కోతి మాత్రం ఎంతో క్రమశిక్షణతో ప్రతి రోజూ స్కూల్‌కు వెళ్తోంది. అంతేకాదూ.. తరగతి గదుల్లో కూర్చుని.. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా ఆలకిస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ క్రమంలో స్పందిస్తున్న నెటిజన్లు.. రకరకాలు కామెంట్స్ చేస్తున్నారు.