వీడెవడండీ బాబు!
posted on Sep 17, 2022 6:01AM
మంచి ఉద్యోగం, లక్షల్లో జీతం, ఆ మధ్య ఫ్లాట్ కొనడం అన్నీ అయ్యాయి. తీరా అద్దంలో చూసుకుంటే ఒకటో రెండో తెల్ల వెంట్రు కలు, దానికి రంగు వేయలేక నానా తంటాలు. అవ తల మామ్మగారు వయసు మించిపోతోంది వీడికి పెళ్లి చేయ రా ఒకటే గోల. ఇంకా వీడికి అమ్మాయి దొరకలేదంటూ తల్లి దండ్రులు తెగ కంగారుపడు తూంటారు. కొంత అమ్మాయిల విషయంలోనూ ఇదే జరుగు తోంది. కొందరు కట్నాల వేధిం పులకు, మరికొందరు శారీరక, మానసిక హింసకు పెళ్లి అయిన తర్వాతా విడిపోతున్నారు. ఇం కొందరు రెండు మూడు పెళ్లిళ్లూ చేసుకుంటున్నారు..గుట్టుచప్పుడు కాకుండా. ఆనక జనానికి పోనీ పోలీసులకు తెలిస్తే వాడి పరిస్థితేమిటి అన్నది తర్వాత. సౌదీలో ఒక మహానుభావుడయితే ఏకంగా 43 సంవత్సరాల్లో 53 పెళ్లిళ్లు చేసుకున్నాట్ట!
గల్ఫ్ న్యూస్‌లోని ఒక నివేదిక ప్రకారం, 43 సంవత్సరాల కాలంలో, అతను వేర్వేరు మహిళలను 53 సార్లు వివాహం చేసుకున్న ట్లు సౌదీ అబ్దుల్లా అంటే లోకమంతా వీడెవడ్రా నాయనా అనుకున్నారు. అతను వ్యక్తిగత ఆనందం కోసం ఈ విధంగా ప్రవ ర్తించ డంలేదని, శాంతి, స్థిరత్వాన్ని ఆశించి ఇన్నిసార్లు పెళ్లిపెళ్లు చేసుకున్నాట్ట అబ్దుల్లా! అంటే భార్యతో గొడవపడినపుడల్లా ఇంట్లోం చి వెళిపోతున్నాడనుకోవాలా!
63 ఏళ్ల అబూ అబ్దుల్లా ను ఇప్పుడు శతాబ్దపు బహుభార్యాత్వవేత్త అని గల్ఫ్ న్యూస్ తన నివేదికలో ప్రస్తావించింది.
అబ్దుల్లా ఇటీవల స్థానిక మీడియా టెలివిజన్ లో ఒక ఇంటర్వ్యూకూడా ఇచ్చాడు. ఆ పట్టణంలోనూ ఈ ప్రబుద్ధుడు ఒక మహిళ ను వివాహం చేసుకున్నాడట. అయితే అదృష్టవశాత్తూ మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని చెప్పాడు.
అతను కూడా, తాను మొదటిసారి వివాహం చేసుకున్నప్పుడు, నేను సుఖంగానే ఉన్నాను. పిల్లలను కలిగారు. నేను ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకోవాలని అనుకోలేదని ఏదో అలా జరిగిపోయిందని తనను తాను ఇప్పటికీ సమర్ధించు కోవడం బహుశా అబ్దుల్లా వల్లే అవుతోంది.
మొదటి వివాహం అయిన కొంతకాలం తర్వాత, సమస్యలు వచ్చాయి. తన 23 ఏటమళ్లీ వివాహం చేసుకోవాలని నిర్ణయిం చుకున్నాడు. అయితే బుద్ధిగా తన నిర్ణయాన్నిభార్యకు తెలియజేసాడు. ఆమె సరే అంది. అలా రెండో పెళ్లి అయింది. కానీ ఇద్దరు భార్యల మధ్య ఎవరయినా సుఖంగా ఉంటారా. ఏవో ఒక గొడవలు వస్తాయి. ఇతగాడూ వారి మధ్య నలిగాడు. వాళ్ల మధ్య గొడవ లతో అతని వైవాహిక జీవితంలో సమస్య మొదలైంది, అది అతను మరో రెండుసార్లు పెళ్లి చేసుకోవలసి వచ్చింది. అబ్దుల్లా ముగ్గురు భార్యలు చివరికి విడాకులు తీసుకున్నారు.
ఇలా ఏదో ఒక గొడవలతో చాలాకాలం నుంచి 53మందిని పెళ్లి చేసుకున్నాడు అబ్దుల్లా. అతని వివాహాలు చాలా వరకు సౌదీ అరేబియాకు చెందిన మహిళలతో జరిగాయి. అయితే విదేశాలకు వెళ్లితే ఎవరయినా వస్తువులు కొంటారు, తింటారు. ఈ మహానుభావుడు విదేశీ పర్యటనల్లో వివాహాలూ చేసుకున్నాడు.