ముఖ్యమంత్రి గోకారా?.. గోకించుకున్నారా?
posted on Sep 16, 2022 @ 6:14PM
ఒక్కోసారి ఆలస్యం అమృతం విషం అవుతుంది .. ఇంకొన్ని సందర్భాలలో అదే ఆలస్యం విషాన్ని అమృతంగా మారుస్తుంది. నిజానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్, పదునైన వ్యూహాలతో ప్రత్యర్ధులు ఉక్కిరి బిక్కిరి చేయడంలో, ఆరితేరిన దిట్ట. అందులో ఎవరికీ ఎలాంటి సందేం లేదు. అయితే, అప్పుడప్పుడు అంతటి ఆయన కూడా, తెలిసో తెలియకో తప్పులో కాలేసిన సందార్భాలు లేక పోలేదు.
గతాన్ని అలా పక్కన పెట్టినా, ఇప్పడు ఫ్రెష్ గా ముఖ్యమంత్రి గారు మరోమారు తప్పులో కాలేశారు. నిజానికి, ఈ మధ్య కాలంలో ఆయన తప్పులో కాలేయడమే అలవాటుగా మార్చుకున్నారని అనేవాళ్ళు ఉన్నారు, కానీ,, అది వేరే విషయం, అనుకోండి. అదలా వుంచి విషయంలోకి వస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కి ఎందుకో ఏమో కానీ, ఒక్కసారిగా రాజ్యాంగ నిర్మాత అంబేద్కర మీద ఎక్కడ లేని గౌరవం పుట్టుకొచ్చాయి.అంతే కొత్తగా కడుతున్న పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ప్రధాని మోడీని డిమాండ్ చేశారు. డిమాండ్ చేయడం ఏమిటి, మూడు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో ఆమేరకు ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అంతటితో ఆగకుండా నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయానికి, అంబేద్కర్ పేరు, పెట్టాలని ముఖ్యమంత్రి నిర్ణయించి, ఆదేశాలు జారీ చేశారు.అయితే మోడీని ఇరకాటంలో పెడుతున్నాననే సంతోషంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఆయన మెడకే చుట్టుకుంది. అయన్నే ఇరకాటంలోకి నెట్టిందని అంటున్నారు.
ఎప్పుడో కాదు, కొద్ది రోజుల క్రితమే ఆయన రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బీఆర్ అంబేద్కర్ గురించి,భారత రాజ్యాంగం గురించి తమ ‘అమూల్య’ అభిప్రాయం బహిరంగంగా వ్యక్తపరిచారు. వెనకటికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ఆమోదించిన అర్దినెన్స్’ పత్రాలను పబ్లిక్’గా చించి పోగులు పెట్టిన విధంగా, అంబేద్కర్ రాజ్యాంగాన్ని కేసేఆర్ చేతులతో, చేతలతో కాకున్నా, నోటీ మాటలతో చించి అవతల పారేశారు.అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయాలని, ఇంగ్లీష్, హిందీ, తెలుగు మూడు భాషల్లో డిమాండ్ చేశారు.
అంబేద్కర్ రాజ్యాంగం చెల్లని నోటు, చిత్తు కాగితం అన్న రీతిలో అవహేళన చేశారు. అసలు అంబేద్కర్ ఎవరు? హూ ఈజ్ హీ? అన్న రీతిలో మాట్లాడారు. దళిత సంఘాలు.. అభ్యతరం చ్జేపితే..దళిత సంఘాలకు ఏమి పని, అంటూ విలేకరలపై ఎదురు దాడి చేసి నోరు మూయించారు. ఇప్పడు అప్పుడు ఆయన అంబేద్కర్ గురించి, అంబేద్కర రచించిన రాజ్యాంగం గురించి, దళితిల గురించి వెలిబుచ్చిన అమూల్య అభిప్రాయాలతో పాటుగా ఎనిమిదేళ్ళుగా, ముఖ్యమంత్రి హోదాలో ఒక్క నాడు అంబేద్కర విగ్రహానికి ఓ దండేసి, దండం పెట్టింది లేదనే నగ్న సత్యం మొదలు దళితులకు ఆయన చేసివదిలేసిన వాగ్దానాల వరకు ఒకటొకటిగా ఏకరువు పెడుతూ, విపక్షాలు ఆయని నిలదీస్తున్నాయి.
నిజానికి, అది ముఖ్యమంత్రి డీఎన్ఎ ప్రభావమో, మరేమో కానీ, దళిత ముఖ్యమంత్రి మొదలు మూడెకరాల భూమి వరకు దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నిలుకోలేదనే దృఢమైన అభిప్రయం దళితులలో బలంగా పటుకు పోయింది. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. దీంతో ముఖ్యమంత్రి, అంబేద్కర్ పేరున దళితులపై కొత్తగా ఎత్తుకున్న ప్రేమపై ప్రతిపక్షాలు స్పందించక ముందే సామాన్య ప్రజలు ముఖ్యంగా ఎనిమిదేళ్ళ తెరాస పాలనలో దగాపడిన దళితులు ప్రశ్నిస్తున్నారు. దీంతో, ముఖ్యంత్రి ఏమో కానీ, తెరాస నాయకులు మాత్రం ప్రజల్లో పలచనవుతున్నామని అంటున్నారు. ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.
అదొకటి అలా ఉంటే, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం కాదు, నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి కుర్చీలో దళితుని కూర్చో పెట్టాలని విపక్షాలతో పాటుగా దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.అంతే కాదు దళిత ముఖ్యమంత్రి విషయంలో ఇచ్చిన మాట తప్పడమే కాకుండా, ‘దళిత సీఎం కానందుకు ప్రజలు నన్ను ఓడించారా.. రెండోసారి కూడా అధికారం ఇచ్చారు. అలాంటప్పుడు దళిత సీఎం హామీకి విలువ ఎక్కడిది. అది ముగిసిన అధ్యయనం’ అని కేసీఆర్ ప్రకటించారు.
దీంతో దళితులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. మరోవైపు విపక్షాలు ఈ హామీని పదేపదే గుర్తుచేస్తున్నాయి. అధికార పక్షాన్ని ప్రశ్నిస్తున్నాయి.ఇదొక్కటే కాదు, ముఖ్యమంత్రి, తెరాస నాయకులూ సమాధానం చెప్పవలసిన చిక్కు ప్రశ్నలు ఎదుర్కుంటున్నారు. ఇప్పుడు స్థిమితంగా ముఖ్యమంత్రి అనవసరంగా దళితుల గోక్కున్నామని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీ, తనను గోకినన గోకకున్నా, తాను మాత్రం మోడీని గోకుతూనే ఉంటనని అన్నారు. ఇప్పడు ఆ అలవాటులో పొరపాటుగా దళితుల గాయాలను గోకారు. దీంతో ముఖ్యమంత్రి గోకారా, గోక్కున్నారా? అనేది ఇప్పడు తెరాస నాయకులకు చిక్కు ప్రశ్నగా మిగిలింది.