స్టాప్.. వన్ మినిట్!
posted on Aug 4, 2022 @ 1:08PM
ట్రాఫిక్ నిబంధనల గురించి ఎంత చెప్పినా, ఎంత ప్రచారం చేసినా జనం మాత్రం వారి పనుల హడా వుడిలో అసలా నిబంధనల సంగతి మర్చిపోతారు. వీలైతే దూసుకుపోవడమే తప్ప ముందు ప్రమా దానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనకు తావీయరు. సిగ్నల్ అంటేనే వాహనదారులకు చిరాకు. ఇంటి నుంచి నేరు గా ఆఫీసుకి వెళిపోవాలనే అనుకుంటారు. సిగ్నల్స్ పై అవగాహన కార్యక్రమాలు కేవలం స్కూలు పాఠా నికే పరిమితం చేస్తున్నారు. కానీ కుపాటా అనే కుక్కపిల్ల మాత్రం చాలా కఠినంగా జీబ్రా క్రాసింగ్‌ను పహారా కాస్తూ వాహనాలను కదలనీయలేదు.
ఏ దేశంలోనో, ఏ నగరంలోనో తెలీదు గాని కుపాటా మాత్రం చాలా జాగ్రత్తలు తెలిసిన బుజ్జి కుక్కపిల్ల. దీనికి తన యజమాని, ఆయన పిల్లల్నే కాదు స్కూలుకి వెళ్లే పిల్లల్ని కూడా జాగ్రత్తగా జీబ్రా క్రాసింగ్ దాటించాలన్న పట్టుదల. అసలు అనవసరంగా గట్టిగా హారన్లు కొడుతూ కార్లూ, టూవీలర్లు వెళ్లడమే దానికి ఇష్టం లేదు. సిగ్నల్స్ దగ్గరా చెవులు చిల్లులు పడేలా హారన్లు కొడుతూండడంతో మనుషుల మీద దానికి విపరీత కోపం వచ్చేసింది. అందుకే సిగ్నల్స్ దగ్గర పహారాకి సిద్ధపడింది.