బీజేపీ పెద్దిరెడ్డిని పట్టేస్తే వైసీపీ గతేంటి?
posted on Aug 4, 2022 @ 12:33PM
ఒక రాజ్యాన్ని వశం చేసుకోవడానికి సవాలక్ష వ్యూహాలు వేస్తారు. అది పాతకాలం రాజుల కాలం. అత్యాధు నిక కాలంలో అంతకంటే చురుగ్గా వ్యూహాలు వేస్తు లోక ప్రసిద్ధులవుతోంది భారతీయ జనతాపార్టీవారే. బీజేపీ హేమాహేమీల కంటే మించిన వ్యూహకర్తలు, పావులు కదపడంలో ఆ చురుకుదనం ఎవ్వరికీ ఉండ దు.
దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ తమ ఆధిపత్యం చెలాయించాలన్న చిన్న కోరికను పెద్ద పటం మీద అష్టాచమ్మా ఆడి మరీ అధికారం లాక్కొనే యత్నాలు చేయడం వారితోనే సాగుతోంది. అందుకు తాజా చిత్రం మహారాష్ట్రలో చూపారు. శివసేనపార్టీలోనే ఒక తిరుగుబాటుదారుడిని ప్రేరేపించి కత్తిలా ఉపయో గించి థాక్రేకు దిమ్మదిరిగే వ్యూహచిత్రాన్ని ప్రదర్శించి ఆయన్ను పక్కకు నెట్టేశారు. కానీ వారి వేగాన్ని, చతురతను నిలువరించే వారు లేకపోవడ మే వారికి కొండంత ధైర్యాన్నిస్తోంది. కేంద్రంలో ప్రధాన ప్రతి పక్షం అంతటి ఆత్మస్థయిర్యంతో లేకపోవడమే మోదీ, అమిత్ షా స్నేహం మరింత బలీయపడింది. వారి ద్దరు ఏది తలిస్తే అది అమలు జరిగిపోతోంది.
ఇక ఆంధ్రాలో 2019 ఎన్నికల్లో వైసీపీకి తెరచాటున సహకరించి బీజేపీయే అందలమెక్కించిందనేవాదనా ఉంది. ఇందుకు టీడీపీ కీలక నాయకులుగా ఉన్న సుజనా చౌదరి, సీఎం రమేష్ ను ఇంకా జాబితా లో ఉన్న ప్రతి ఒక్కరిని బీజేపీ హైకమాండ్ కంట్రోల్ చేసింది. ఆర్థిక విషయంలోనూ.. సాయం అందకుండా చూసింది. ఇది.. ఎంతగా సాగిందంటే మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేసిన చోట సైతం ఎక్కువ పంచ నీయకుండా చూశారు. అంతేకాదు.. టీడీపీ రాజ్యసభ ఎంపీలు అందరూ.. బీజేపీలో చేరిపోయారు. అప్పటి వరకు వారిపై ఉన్న కేసులు, సీబీఐ, ఈడీ వేధింపులు సైతం లేకుండా పోయాయి.
కాగా 2024 ఎన్నికల నాటికి.. వైసీపీలో ఉన్నకీలక నాయకుడు, సీనియర్ నేత, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని తమవైపునకు తిప్పుకొనే ప్రయత్నం చేస్తుంది.. బీజేపీ కనుక ఆయనను కంట్రోల్ చేస్తే.. వైసీపీ పరి స్థితి ఏంటి? అనేది.. పెద్ద ఎత్తున టీడీపీలోను, వైసీపీలోను.. చర్చ జరుగుతోంది. పెద్దిరెడ్డి కుటుంబానికి, వైసీపీకి మధ్య అవినాభ సంబంధం ఉంది. అదేసమయంలో రాయల సీమలోని రెండు జిల్లాలను పెద్ది రెడ్డి తన కనుసన్నల్లో నడిపిస్తున్నారు.అదేసమయంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాయకులను ఆయన అదుపులో పెట్టుకున్నారు.
ఇలాంటి నేపథ్యంలో పెద్దిరెడ్డిని తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ ప్రయ త్నిస్తే, వైసీపీని నియంత్రించడం ఖాయమనే వాదన బిజేపి నాయకులు అధిష్టానం వద్ద వినిపిస్తుండ డం గమనార్హం. పైగా పెద్దిరెడ్డి సౌమ్యుడు.. అందరి మాటా వినేవాడు.. అనే పేరు కూడా ఉండడం గమ నార్హం. ఏదేమైనా.. ఏపీలో అన్నీ పెద్దిరెడ్డి ఫ్యామిలీ చూసుకుంటోంది. ఎక్కడ ఉప ఎన్నిక జరిగినా.. ఆయనే పార్టీకి దిక్కు, మొక్కు అన్నట్టుగా మారారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిని అడ్డు పెట్టి.. బీజేపీ వ్యూహత్మకంగా అడుగులు వేస్తే.. వైసీపీకి చిక్కులు తప్పవనే అంటున్నారు బీజేపీ నేతలు..