పెర్త్‌లో స్టాయినిస్ సిక్స్‌ల మోత... లంక బెంబేలు!
posted on Oct 25, 2022 @ 9:56PM
బౌలర్లు బౌలింగ్ మర్చిపోయేలా చితకబాదుడు బ్యాటింగ్ అంటే ఏమిటి అనే ప్రశ్నకు తాజా సమాధానమే మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్. సునాయాసంగా సిక్స్‌లు బాది వార్నర్ రికార్డు అధిగమించి, యువరాజ్‌సింగ్ వంటి మేటీ బ్యాట్స్‌మన్‌ల సరసన చేరాడు. మంగళవారం టీ-20 ప్రపంచకప్ సూపర్ 12 లో భాగంగా ఆస్ట్రేలియా, శ్రీలంక మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ మార్కస్ తన బ్యాటింగ్ సత్తాను ప్రదర్శించడంలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కేవలం 17 బంతుల్లో అర్ధసెంచరీ చేశాడు. గతంలో ఇలా అతి తక్కువగా 18 బంతుల్లో అర్ధసెంచరీ చేసిందీ ఆసీస్ స్టార్ బ్యాటర్ వార్నర్. అంతకు ముందు 2007 ప్రపంచకప్‌లో సూపర్ ఆల్ రౌండర్ యువరాజ్ డర్బన్‌లో ఇంగ్లండ్‌మీద 12 బంతుల్లోనే అర్ధసెంచరీ చేశాడంటే ఇంగ్లండ్ బౌలర్లు నిజంగానే బౌలింగ్ మర్చి పోయి ఉంటారు.
కాగా పెర్త్ మ్యాచ్‌లో మంగళవారం ముందుగా బ్యాట్ చేసిన శ్రీలంక 156 పరుగులు చేసింది. బౌలింగ్, ఫీల్డింగ్‌తో ఆసీస్‌ను కట్టడి చేయవచ్చని గెలవడానికి కాస్తంత మంచి స్కోర్ చేశామని ధైర్యంగా ఫీల్డింగ్‌కి దిగారు. మూడు వికెట్లు పడగొట్టేరు. చూస్తుండగానే రెచ్చిపోయే మాక్స్‌వెల్‌ను కాస్తంత కట్టడి చేయగలిగారు. అతను వెనుదిరగగానే మ్యాచ్ మీద పట్టు బిగించా మనే లంక బౌలర్లు అనుకున్నారు. కానీ ఆల్ రౌండర్ స్టాయినిక్ బాదేస్తాడని అస్సలు భావించలేదు.
ఒక వంక ఆరాన్ ఫించ్ ఎంతో ఓపికతో ఆడుతూ స్కోర్ చేస్తుండటం ఇన్నింగ్స్ నిలబెట్టే యత్నాలు చేస్తున్నాడు. గ్లెన్ మాక్స్‌వెల్ మహాద్భుతంగా ఆడుతున్నాడు. కానీ సిక్స్‌కొట్టే యత్నంలో దొరికిపోయాడు. అప్పు డు వచ్చాడు అసలు హీరో స్టాయినిస్ సిక్స్‌ల మోతతో పెర్త్ స్టేడియంలో ఆసీస్ వీరాభిమానులకు కనుల పండుగే అయిందనాలి. అతని వీరవిహారంతో ఆసీస్ కేవలం 16.3 ఓబర్లలోనే 157 పరుగులూ చేసి విజయం సాధించింది. అప్పటివరకూ బ్రహ్మాండంగా ఆడిన ఫించ్, మాక్స్ వెల్‌ను ప్రేక్షకులు మర్చిపోయేట్టు చేశాడు స్టాయినిస్. సింగిల్స్ డబుల్స్ చేస్తూ మధ్య మధ్య ఫోర్లు కొట్టినా మ్యాచ్ ముగిం చేయచ్చు అనుకు న్నారు. కానీ స్టాయినిస్ మరో విధంగా ఆలోచించాడు. ఆ ఆలోచన శ్రీలంక బౌలింగ్, ఫీల్డింగ్ ఏమాత్రం అతని ధాటిని నిలువరిం చలేకపోయింది. 18 బంతుల్లో 59 కొట్టి అజేయంగా నిలిచాడు. ఫించ్ 31 పరుగులు చేయడానికి 42 బంతులు ఎదుర్కొన్నాడు.