సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి...రిషీ సునాక్
posted on Oct 25, 2022 @ 5:52PM
రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని బాద్యతలు చేపట్టారు. ముందుగా ఆయన లండన్ బకింగ్ హామ్ ప్యాలెస్ కి వెళ్లి కింగ్ చార్లెస్ 3ను మర్యాదపూర్వకంగా కలిశారు. లిజ్ ట్రస్ ప్రధాని పదవి నుంచి తప్పుకోవడం రిషి ఆ బాధ్యతలు స్వీకరించడం వేగంగా జరిగిపోయాయి. భారతీయ మూలాలు ఉన్న రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాని కావడం పట్ల భారత్ ప్రజలు, ప్రభుత్వం ఎంతో ఆనందం వ్యక్తం చేసింది. ప్రధానిగా రిషీ తన తొలి ప్రసంగంలో భవిష్యత్తులో అనేక సవాళ్లను ఎదుర్కొనడానికి అందరం సిద్ధపడాలని హెచ్చరిం చడం గమనార్హం. అప్పుల భారం రానున్న తరాల మీద పడేయనని అన్నారు.
అంతకుముందు లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధానిగా చివరి ప్రసంగం చేశారు. బ్రిటన్ కష్టాల నుంచి అతి త్వర లోనే బయటపడగలదన్న ఆశాభావం వ్యక్తం చేశారు. రిషీకి ఆమె శుభాకాంక్షలు చెప్పారు. బోరిస్ జాన్సన్ తర్వాత ట్రస్ అధికార కన్సర్వేటివ్ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు. అయితే ఆమెకు రిషీ గట్టి పోటీనే యిచ్చారు. ఆమె తెచ్చిన మధ్యంతర బడ్జెట్ దేశ ఆర్ధిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఆమె అనుసరించిన ఆర్ధిక విధానాలతో దేశం మరింత సమస్యలకు దారితీసింది. ఈ కారణంగా ఆమె వ్యతి రేకత ఎదుర్కొని పదవి నుండి దిగిపోవాల్సి వచ్చింది. బ్రిటన్ చరిత్రలో చిన్నవయసులో ప్రధాని పదవిని చేపట్టిన వ్యక్తిగా, భారత్ సంతతికి చెందినవాడిగా రిషీ రికార్డు నెలకొల్పారు.
రిషి సునాక్ చూసి మేము గర్విస్తున్నామని. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటు న్నామని రిషీ మామగారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి అన్నారు. బ్రిటన్ ప్రధానిగా ఆయ న ఉత్తమ నిర్ణయాలు తీసుకుంటారని నమ్ముతున్నానని అన్నారు. 2009లో రిషి సునాక్ నారాయణ మూర్తి కుమార్తె అక్షితామూర్తిని వివాహమాడారు. వీరికి ఇద్దరు సంతానం. కృష్ణా సునాక్, అనౌష్కా సునాక్.
ఇదిలాఉండగా, రిషీ సునాక్ బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టడం పట్ల భారత్ లోని వివిధ పార్టీలవారు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం మాత్రం సునాక్ విజయం నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మెజారిటీయేతర వ్యక్తులను అధికార పీఠం మీద కూర్చునేందుకు అవకాశం కల్పించడం గమనార్హమని ట్వీట్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం గురించి నిరంతరం భారీ ఉపన్యాసాలు ఇచ్చేవారు సునాక్ విజయాన్ని గురించి ఆాలోచించి మారుతున్న రాజ కీయ పరిస్థితులనుంచీ మనవాళ్లు నేర్చుకోవాల్సిన గుణపాఠాలున్నాయని, బ్రిటన్ లో జరిగిన రాజకీ య పరణామాలను మన దేశంలో ఊహించుకోగలమా అని పరోక్షంగా బీజేపీని కాంగ్రెస్ సీనియర్ నేతలు శశి థారూర్, జైరాం రమేష్ ఎద్దేవీ చేశారు.