స్పీడ్ 4
posted on Jul 25, 2023 @ 3:35PM
వనమా ఎన్నిక చెల్లదు
41. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారంటూ ప్రత్యర్థి జలగం వెంకట్రావు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు నేడు తీర్పు వెలువరించింది.
..........................................................................................................................................................
తెలంగాణ పాఠశాలల్లో పాఠ్యాంశంగా సీపీఆర్ శిక్షణ
42. తెలంగాణలో పాఠ్యాంశంగా సీపీఆర్ శిక్షణను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణాల ను నియంత్రించేందుకు విద్యార్థులలో సీపీఆర్ పై అవగాహన పెంచడమే లక్ష్యంగా పాఠ్యాంశంగా ప్రాథమిక శిక్షణ చేర్చనుంది.
......................................................................................................................................................
43. రానున్న రోజులలో ఐటీ ఉద్యోగాలలో ఫ్రెషర్స్ రిక్రూట్ మెంట్ బాగా తగ్గిపోయే అవకాశం ఉందని ఆర్థిక సంవత్సరంకోసం ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్ బిజినెస్‌లైన్ ద్వారా సేకరించిన డేటా వెల్లడించింది. అమెరికాలో ఏర్పడిన ఆర్థిక మాంద్యమే ఇందుకు కారణమని ఆ డేటా పేర్కొంది.
.............................................................................................................................................................
కర్నాటక సర్కార్ కూల్చివేతకు సింగపూర్ లో కుట్ర: డీకే
44. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు సింగపూర్ లో కుట్ర జరుగుతోందని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. వైద్య పరీక్షల కోసం జేడీఎస్ నేత, మాజీ సీఎం కుమారస్వామి సింగపూర్‌కు వెళ్లిన సమయంలో డీకే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
.............................................................................................................................................................
6న తమిళనాడుకు రాష్ట్రపతి ముర్ము
45. మద్రాసు విశ్వవిద్యాలయం 165వ స్నాతకోత్సవాల్లో పాల్గొనేందుకు ఆగస్టు 6న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తమిళనాడుకు రానున్నారు. రాష్ట్రపతిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత ద్రౌపది ముర్ము తమిళనాడు పర్యటనకు రావడం ఇదే మొదటి సారి.
..............................................................................................................................................
ఎన్నికలకు ముందే అన్నాడీఎంకేలో వర్గాలన్నీ విలీనం: శశికళ
46. వచ్చే యేడాది జరగనున్నసార్వత్రిక ఎన్నికలకు ముందే అన్నాడీఎంకేలోని చీలిక వర్గాలన్నీ విలీనమౌతాయని ఆ పార్టీ బహిష్కృత నాయకురాలు శశికళ అన్నారు. మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆమె అన్నారు.
..................................................................................................................................................
బైజూస్ కార్యాలయం మూత
47. విద్యారంగ టెక్ దిగ్గజం బైజూస్ సంస్థ తాజాగా బెంగళూరు కల్యాణి టెక్‌పార్క్‌లోని కార్యాలయాన్ని ఖాళీ చేసింది. ఖర్చులు తగ్గించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కిన్న బైజూస్ ఇక్కడి ఉద్యోగులను ఇతర కార్యాలయాలకు సర్దుబాటు చేసింది.
............................................................................................................................................................
జగన్ పై గంటా విమర్శలు
48. ఏపీ సీఎం జగన్‌పై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు విమర్శలు గుప్పించారు. రైతుల ప్రాథమిక హక్కులను కాలరాశారని, రాజధాని నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ ట్వీట్ చేశారు. ప్రతీ సమావేశంలో తాను అమాయకుడినంటూ హాస్యాన్ని బాగా రక్తికట్టిస్తున్నారని సెటైర్లు వేశారు.
...........................................................................................................................................................
అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశమే లేదు: ఫడ్నవీస్
49. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అయిన అజిత్ పవార్ త్వరలో మహారాష్ట్ర సీఎం కాబోతున్నారంటూ కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ వ్యాఖ్యలను బీజేపీ నేత ఫడ్నవీస్ కొట్టి పారేశారు. అజిత్ పవార్ సీఎం అయ్యే అవకాశం ఇసుమంతైనా లేదని చెప్పారు. చవాన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు.
...........................................................................................................................................................
మత్స్యకారుల వలలో డాల్ఫిన్.. వండుకుని తినేశారు
50.యమునా నది వరదల్లో కొట్టుకు వచ్చిన డాల్ఫిన్ మత్స్యకారులకు చిక్కింది. వలలో చిక్కిన డాల్ఫిన్ ను మత్స్యకారులు భుజంపై మోసుకొని ఇంటికి తీసుకువెళ్లారు. దానిని వారు వండుకు తినడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.