స్పీడ్ న్యూస్ 3
posted on Jul 25, 2023 @ 3:00PM
సాంకేతిక లోపంతో నిలిచిన టికెట్ల బుక్కింగ్
26. సాంకేతిక లోపంతో ఐఆర్‌సీటీసీలో టికెట్ల బుకింగ్ నిలిచిపోయింది. ఈ మేరకు ట్వీట్ చేసిన ఐఆర్‌సీటీసీ సమస్యను పరిష్కరించేందుకు తమ సాంకేతిక సిబ్బంది ప్రయత్నిస్తున్నారని పేర్కొంది. సాధ్యమైనంత త్వరలో టికెట్ బుకింగ్ ను పునరుద్ధరిస్తామని తెలిపింది.
...............................................................................................................................................................
రోడ్లపైకి వరద నీరు
27.ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి జగ్గయ్యపేటకు వెళ్లే ఆర్‌అండ్‌బీ రోడ్డు గోతులతో అధ్వానంగా తయారైంది. మరోవైపు పక్కనే ఉన్న పంట పొలాల్లో నుంచి వచ్చిన వరద రోడ్డుపై ప్రవహిస్తోంది.
.................................................................................................................................................
కట్టేరు వాగు ఉధృతి
28. భారీ వర్షాలకు తిరువూరు నియోజకవర్గ పరిధిలోని వినగడప వద్ద కట్లేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. కట్లేరు వాగు ఉధృతి కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో సమీప 20 గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద తగ్గే వరకు వాగు దాటవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
............................................................................................................................................................
కోటిపల్లి ప్రాజెక్టులోని వరద నీరు
29. గత ఐదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కోటిపల్లి ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరాయి. పూర్తిస్థాయి నీటిమట్టంతో కోట్లు ప్రాజెక్ట్ ఆ లుగు పారుతుంది. కోట్పల్లి ప్రాజెక్ట్ నుండి నీరు కుదరడంతో నాగ సంబంధర్ దోర్నాల మీదుగా వాగు పొంగి ప్రవహిస్తుంది
..............................................................................................................................................
భారీ వర్షాలకు తెగిపోయిన రహదారి
30.ఆర్మూర్ లో గత రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా , రైల్వే స్టేషన్ ప్రధాన రహదారిపైకి భారీగా వరద నీరు రావడంతో ఆ రహదారి తెగిపోయింది. దీంతో రైల్వే స్టేషన్ కు రాకపోకల నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న్నారు.
..................................................................................................................................................
నేతన్నలపై దాడులు సహించం: పరిటాల శ్రీరామ్
31. నేతన్నలపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని తెలుగుదేశం నాయకుడుపరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. గత నెలలో విజయవాడ ఆలయ సిల్క్స్ యజమాని ధర్మవరం పట్టు వ్యాపారస్తులైన గిర్రాజు శశి, కోటం ఆనంద్ లపై దాడి పట్ల పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందించారు.
.........................................................................................................................................................
మోడీ సర్కార్ పై అవిశ్వాసం
32. మణిపూర్ లో హింసపై ప్రధాని మోడీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న తమ డిమాండ్ ను కేంద్రం పట్టించుకోకపోవడంతో విపక్ష కూటమి ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మణిపూర్ అంశంపై కేంద్రపై లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
................................................................................................................................................
27న రైతుల ఖాతాల్లోకి ఆ సొమ్ములు
33. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు తీసుకొచ్చిన పీఎం కిసాన్ యోజన పథకం నిధులను ఈ నెల 27న విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 13 విడతలుగా రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం నగదు జమ చేసిన సంగతి తెలిసిందే.
........................................................................................................................................................
ఢిల్లీలో డెంగ్యూ జ్వరాలు
34. యమునానది వరదలతో అతలాకుతలమైన ఢిల్లీ నగరం ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులకు చేరుకుంటోంది. అంతలోనే మరో ముప్పు నగరవాసులను భయంపెడుతోంది. ఢిల్లీ వాసులు డెంగ్యు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 187 డెంగ్యు కేసులు నమోదు అయ్యాయి.
....................................................................................................................................................
మణిపూర్ లో మరో దారుణం
35. మణిపూర్ లో మరో దారుణ వెలుగులోకి వచ్చింది. కొందరు సాయుధ వ్యక్తులు ఓ స్వాతంత్ర్య సమయోధుడి భార్యను ఇంట్లో బంధించి, సజీవ దహనం చేశారు. కాక్చింగ్ జిల్లాలోని సెరో గ్రామంలో మే 28న ఈ దారుణం జరిగింది. బాధిత వృద్ధురాలు ఇబెటోంబికు 80 ఏళ్ల వయసు ఉంటుంది.
...............................................................................................................................................................
ఇండియాపై మోడీ విమర్శలు
36. విపక్ష కూటమిపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మాట్లాడిన మోడీ విపక్ష కూటమి పేరు లక్ష్యంగా ఆయన గుప్పించారు. పీఎఫ్ఐ, ముజాహిదీన్ వంటి వంటి ఉగ్ర సంస్థల పేరులోనూ ఇండియా ఉందన్నారు.
...................................................................................................................................................
ఆకాశంలో స్వర్గానికి ద్వారం
37. బెంగళూరులో వినువీధిలో కనిపించిన వింత ఆకారం అందరినీ ఆశ్చర్య చకితులను చేసింది. ఆకాశంలో మబ్బుల మధ్య ధ్వారం ఆకారం ఏర్పడటం చూపరులను ఆకట్టుకుంది. స్వర్గానికి ద్వారంలా ఉందంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
...............................................................................................................................................................
జల దిగ్బంధనంలో వేల్పూర్
38. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆర్మూర్ - మెట్ పల్లి రోడ్డులో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వేల్పూర్ జల దిగ్బంధం పై క్షేత్రస్థాయిలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు.
........................................................................................................................................................
తిరుమల ప్రత్యేక దర్శనం టికెట్లు విడుదల
39. తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదలయ్యాయి. tirupatibalaji.ap.gov.in సైట్లో భక్తులు తమ వివరాలు నమోదు చేసి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇక వృద్ధులు, వికలాంగుల దర్శన కోటా టికెట్లు కూడా విడుదలయ్యాయి.
............................................................................................................................................................
వరంగల్ ఖమ్మం హైవేపై భారీగా వరద నీరు
40. వరంగల్-ఖమ్మం హైవేపై భారీగా వరదనీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పంతిని హైవేపై వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. 5 కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించింది. ఓ లారీ వరద నీటిలో చిక్కుకుంది.