స్పీడ్ న్యూస్ 3
posted on Jul 24, 2023 @ 3:10PM
జగన్ పర్యటనకు వ్యతిరేకంగా నిరసనలు
26. సీఎం జగన్ పర్యటనను నిరసిస్తూ రైతులు శిబిరాలలో నల్ల బెలూన్లు, జెండాలతో నిరసనకు దిగడంతో కృష్ణరాయపాలెంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అమరావతి రైతుల నేతలను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.
.............................................................................................................................................................
పోలవరం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
27. పోలవరం ప్రాజెక్టుకు గోదావరి వరద కొనసాగుతోంది. స్పిల్ వే దగ్గర ఈ రోజు 32.320 మీటర్లకు గోదావరి నీటిమగట్టం చేరింది. దీంతో దిగువకు 8,60,874 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
............................................................................................................................................................
కేటీఆర్ కు మెగాస్టార్ జన్మదిన శుభాకాంక్షలు
28. తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. మీ ప్రయాణంలో మీరు వేసే ప్రతి అడుగుకు నా ఆశీర్వాదాలు ఉంటాయి.. హ్యాపీ బర్త్ డే. అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
.......................................................................................................................................................
జిమ్ పై కప్పు కూలి పది మంది మృతి
29. చైనాలో ఓ స్కూల్‌లో ఉన్న జిమ్ పైకప్పు ఆదివారం ఒక్కసారిగా కూలిపోయిన సంఘటనలో పది మంది మరణించారు. సోమవారం ఉదయం నాటికి శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన ఒకరికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.
.....................................................................................................................................................
ధర్నాకు అనుమతి కోసం హైకోర్టుకు బీజేపీ
30. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణంలో తాత్సారంపై బీజేపీ మంగళవారం ఇందిరా పార్క్ వద్ద జరపతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ధర్నాకు అనుమతి కోరుతూ బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.
.......................................................................................................................................................
ఇళ్ల నిర్మాణానికి జగన్ శంకుస్థాపన
31.కృష్ణాయపాలెంలో 50వేల ఇళ్ల నిర్మాణాలకు ముఖ్యమంత్రి జగన్ శంకుస్థాపన చేశారు. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పైలాన్ ను ఆవిష్కరించి మోడల్ హౌస్ ను పరిశీలించారు. జగన్ పర్యటన సందర్భంగా రైతుల ఆందోళనలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
....................................................................................................................................................
కార్ఖానాలో ఏటీఎం ధ్వంసం
32. హైదరాబాద్ కార్ఖానాలోని సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏటీఎంను దుండగులు ధ్వంసం చేశారు. సీసీ కెమెరాల దిశను మార్చి చోరీకి ప్రయత్నించారు. అయితే ఏటీఎంలోని సొమ్ము సురక్షితంగానే ఉందని తెలిపిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
.......................................................................................................................................................
33.నడకతో ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణం కార్యక్రమానికి మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మురుగు కాల్వల్లోని ప్లాస్టిక్ వస్తువులను స్వయంగా తొలగించి చెత్త వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
...................................................................................................................................................
ధవళేశ్వరం వద్ద గోదావరి వరద
34. రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటిమట్టం 11.1 అడుగులుగా నమోదైంది. ధవళేశ్వరం నుంచి డెల్టా పంట కాల్వలకు 12,100 క్యూసెక్కులు సముద్రంలోకి 8.99 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
.......................................................................................................................................................
జ్ణానవాపి మసీదులో సర్వేను ఆపాలంటూ సుప్రీంకు
35.జ్ఞానవాపి మసీదులో సర్వేను ఆపాలని కోరుతూ ఆ మసీదు నిర్వహణ కమిటీ సుప్రీం ను ఆశ్రయించింది. సర్వే అంశంపై స్టే విధించాలనీ, ఈ అంశాన్ని గతంలోనే సుప్రీం కోర్టు విచారణను వాయిదా వేసిందనీ ఆ పిటిషన్ లో పేర్కొంది.
.....................................................................................................................................................
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం
36. కర్నూలు జిల్లా హోస్పేట్‌లోని తుంగభద్ర జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయం ఇన్ ఫ్లో 55,657 క్యూసెక్కులు కాగా.. ఒక్కరోజులోనే ఐదు టీఎంసీలు డ్యామ్‌లో చేరాయి. డ్యామ్‌లో నీటిమట్టం ప్రస్తుతం 21.36 టీఎంసీలకు చేరుకుంది.
.......................................................................................................................................................
పార్లమెంటు ఆవరణలో విపక్షాల ధర్నా
37. పార్లమెంటు వేదికగా మణిపూర్ అంశంలో మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడమే లక్ష్యంగా . సోమవారం ‘ఇండియా’ కూటమి నేతలు, ఎంపీలు పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. మణిపూర్‌పై ప్రధాని మోదీ సభలో ప్రకటన చేయాలని వారు డిమాండ్ చేశారు.
..............................................................................................................................................
బోరుబావి నుంచి సురక్షితంగా బయటపడ్డ బాలుడు
38. బిహార్‌లోని కులు గ్రామంలో నాలుగేళ్ల శుభం కుమార్ అనే బాలుడు ప్రమాదవశాత్తూ బోరుబావిలో పడిపోయాడు. బోరుబావిలో పడ్డ బాలుడిని రెస్క్యూ బృందం ఆరు గంటల పాటు శ్రమించి సురక్షితంగా బయటకు తీసింది. రెస్క్యూటీమ్ ను గ్రామస్థులు అభినందించి, కృతజ్ణతలు తెలిపారు.
.......................................................................................................................................................
గుప్త నిధుల కోసం బాలుడి బలి
39. గుప్త నిధుల కోసం 9 ఏళ్ల బాలుడిని బలి ఇచ్చిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. మహారాష్ట్రలోని పొహనె షివార్ గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆరు బయట ఆడుకుంటున్న ఓ బాలుడిని అపహరించి తాంత్రిక పూజలు నిర్వహించి గొంతుకోసి చంపేశారు.
...............................................................................................................................................................
ఏపీ బీజేపీ జోనల్ సమావేశాలు
40. ఏపీ బీజేపీ జోనల్ సమావేశాలు నేటి నుంచి నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి పాల్గొంటారు. నేడు గుంటూరులో కొస్తాంధ్ర జోన్ సమావేశం, రేపు రాజమండ్రిలో గోదావరి జోన్ సమావేశం 27వ తేదీన విశాఖలో ఉత్తరాంధ్ర జోన్ సమావేశం జరగనున్నాయి.