స్పీడ్ న్యూస్ 1
posted on Jul 15, 2023 @ 11:08AM
1. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపి, అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న టీపీసీసీ ప్రచార కమిటీలను ప్రకటించింది. ప్రచార కమిటీ ఛైర్మన్ గా మధు యాష్కీని, కోఛైర్మన్ గా పొంగులేటిని నియమించింది.
2. ఖలిస్థానీ తీవ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్న కారణంగా ఆస్ట్రేలియాలో ఓ భారతీయ విద్యార్థిపై ఇనుపరాడ్లతో దాడి జరిగింది. సిడ్నీ నగరంలోని మేర్రీల్యాండ్స్‌లో ఖలిస్థానీవాదులు ఆ యువకుడిపై ఇనుపరాడ్లతో దాడి చేశారు.
3. వేస్టిండీస్‌తో రెండు టెస్ట్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అరంగేట్రం మ్యాచ్ లోనే భారీ సెంచరీతో ఆకట్టుకున్న యశస్వి జైస్వాల్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. రెండో టెస్టు జూలై 20న మొదలు కానుంది.
4. ఆంధ్రప్రదేశ్ లో ఇసుక తవ్వకాల పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానాపై సుప్రీంకోర్టు ‘స్టే’ విధించింది. జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థ ఎన్జీటీ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ సంచయ్ కరోల్‌తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
5. దేశ రాజధాని నగరం మూడు రోజులుగా జలదిగ్బంధంలో ఉంది. సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీని కలిపే వికాస్ మార్గ్ మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కేవలం మెట్రో ద్వారా మాత్రమే సెంట్రల్ ఢిల్లీ, ఈస్ట్ ఢిల్లీ మధ్య వెళ్లే సౌకర్యం ఉంది.
6. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు నిచ్చారు. కరీంనగర్ లోని డ్యాం సమీపంలో ఫిల్టర్ బెడ్స్ వద్ద మంత్రి గంగుల కమలాకర్ తో కలసి మొక్కలు ఆయన మొక్కలు నాటారు, కీసర గుట్ట వలె కొండగట్టులో ఎనిమిది వందల ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు.
7. బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఆవర్తన ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో 17, 18 తేదీల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ రాష్ట్రంలో నెలాఖరు వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
8. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్‌కి ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఆందోళన చేస్తున్న జనసేన కార్యకర్తను కొట్టిన సంఘటనపై సీఐ అంజూయాదవ్‌తో సహా స్టేషన్ ఆఫీసర్, తిరుపతి డిఎస్పి, తిరుపతి ఎస్పీ, అనంతపురం డిఐజి, తిరుపతి కలెక్టర్, డీజీపీ, హోం సెక్రటరీ, చీఫ్ సెక్రటరీలకు హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది.
9. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహషన్ సోదరుడు ఆమంచి శ్రీనివాసరావు అలియాస్ స్వాములు జనసేన గూటికి చేరనున్నారు. మంగళగిరిలోని పవన్ కల్యాణ్ సమక్షంలో ఆమంచి శ్రీనివాసరావు జనసేన కండువా కప్పుకోనున్నారు.
10. కోనసీమ జిల్లా శివకోడులో ఓఎన్జీసీ పైపు నుంచి గ్యాస్ లీకై పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఓఎన్జీసీ, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.