సారీ దాదా.. బిన్నీ ఓకే!
posted on Oct 12, 2022 @ 12:22PM
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బిసీసీఐ) అధ్యక్షపదవి భారత్ మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీకి దక్కే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు పరిణామాలు మారుతు న్నాయి. ఇప్పటివరకూ ఈ పదవిలో ఉన్న టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీకి దింపేయాలన్న గట్టి నిర్ణయానికి దాదాపు సభ్యులంతా ఓకే అనేశారు. కానీ ఆ స్థానాన్ని కార్యదర్శి జై షా అధిష్టించాలను కున్నారు. కానీ అందుకు అవకాశంలేకుండా ఆయన్ను అదే పదవిలో కొనసాగించాలనుకున్నారు. వాస్తవానికి దాదాపు చివరి నిమిషంలో బిన్నీ పేరు తెరమీదకి వచ్చింది. అంతకుముందు సెలక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రోజర్ బిన్నీ పట్ల అందరి నుంచీ సానుకూల స్పందనే ఉంది.
సౌరవ్ ఐసిసి పదవికి ప్రయత్నిస్తున్నారన్న వార్తలు ప్రచారమయ్యాయి. ఈ కారణంగా ఆయన్ను బీసీసీఐ పదవి నుంచి తొలగించడానికి మరింత వీలయింది. అయితే సౌరవ్ మాత్రం తనకు ఐసిసి కంటే బీసీసీ ఐ ఎంతో ప్రధానమని పదవిని అంటిపెట్టుకునేందుకు విశ్వయత్నం చేస్తున్నారు. ఈ నెల 18న జరిగే బీసీ సీఐ ఏజీఎంలో 36వ అధ్యక్షుడిగా బిన్నీని ఏకగ్రీవంగా ఎన్నుకో నున్న ట్టు సమాచారం. కాగా, కార్యదర్శిగా జై షా మరో విడత కొనసాగనున్నాడు. గంగూలీ స్థానంలో జై షా బోర్డు పగ్గాలు అందుకొంటాడనే ప్రచారం సాగినా.. అది జరగలేదు. అయితే, ఐసీసీ బోర్డులో సౌరవ్ స్థానంలో భారత ప్రతినిధిగా షా వ్యవహరిస్తాడని సమాచారం. బోర్డు చీఫ్ పదవికి బిన్నీ, కార్యదర్శికి షా, ఉపాధ్యక్షుని కోసం రాజీవ్ శుక్లా, కోశాధికారిగా ఆశిష్ షేలర్, జాయింట్ సెక్రటరీగా దేవజిత్ సైకియా, ఐపీఎల్ చైర్మన్‌గా అరుణ్ ధూమల్ మంగళవారం నామి నేషన్ పత్రాలను దాఖలు చేశారు.
అయితే దాదా మాత్రం ఢిల్లీలో కొందరు పెద్దల అండను ఆశిస్తున్నాడు. ఒక వంక బోర్డు అధ్యక్ష పదవి ఇచ్చేందుకు అధికారులు కాదంటున్న తరుణంలో అదే కుర్చీలో కొనసాగుతానన్న పట్టుదల దాదా ప్రదర్శిస్తున్నాడు. ఐసీసీ తలనొప్పుల కంటే ఇంట ఇబ్బందులు పెద్ద కష్టమేమీ కాదన్నది దాదా అభి ప్రాయం. అయితే తన ఇబ్బందిని అర్ధంచేసుకుని పోనీ, ఐపిఎల్ చైర్మన్‌గా ఉండాలని ఆఫర్ ఇచ్చిన ప్పటికీ అది తన స్థాయిని తగ్గిస్తుందనే ఆలోచనలో ఆ ఆఫర్‌ను కాదనే అంటున్నాడు సౌరవ్.