మునుగోడులో ఎదురుకోల!
posted on Oct 12, 2022 @ 1:15PM
మా ఊళ్లో ఒక్కటంటే ఒక్క బడిని బాగుచేయించడానికి ఏళ్లు తిప్పుకున్నారు, మా పొలానికి కరెంటు అడి గితే తన్నినంత పనిచేశారు, మా అపార్ట్‌మెంట్‌కి వాటర్ కనెక్షన్ అడిగితే వేలకు వేలు డిమాండ్ చేశారు.. ఇపుడు ఎదురుకోలు సామెతగా తయారయ్యారు అన్ని పార్టీలవారూ! అవును..అంతా రాజగోపా లుని మహిమ! రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ మీద అలిగి కాషాయం చొక్కా తొడుక్కోవడానికి ఇష్టపడమే ఇంత చేస్తోంది. ఆయన పార్టీ నుంచి బీజేపీకి జంప్‌జలానీ రూపంలో చేరడంతో మునుగోడు ఉప ఎన్నికలకు దృశ్యం మారడం, చిత్రంగా అదే దేశంలో కీలక ఎన్నికలా అందరూ తీసుకోవడం ఓటరుకి, అంతకంటే మును గోడు రైతుకీ తెగని ఆశ్చర్యక రంగా మారింది.
మునుగోడు తెలిచినవాడే దేశాన్ని ఎలతాడన్న స్థాయిలో ప్రచారం జరుగుతోంది. కేంద్రం నుంచి కూడా పార్టీల నాయకులు మునుగోడు లో దిగడం అక్కడి మేకనీ ఖంగారెత్తిస్తోంది. కాంగ్రెస్ నుంచి తమ్ముడు విడిపోయిన తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పార్టీపరంగా ఒత్తిడి పెరిగింది. అందరూ ఆయన్ను అనుమానంగా చూస్తున్నారు, ప్రశ్నించడమే బాగోదనుకుంటున్నారు. మీడియా అడిగేసినా..అది ఆయన ఇష్టం తమ్ముడైనంతమాత్రాన వంటింట్లోకి తీసికెళ్లి తింటూ బుజ్జగించలేను, గడపదాటినవాడిని ఆప లేను కదా అనేశారు వెంకట్‌రెడ్డి. ఏమైనప్పటికీ రాజగోపాలుడు బీజేపీని గెలిపించాలనే అనుకున్నా రు. అంచేత కేంద్రం నుంచి అందరినీ పర్యటనకు దింపారు. భారీ ప్రసంగాలు, ప్రమాణాలు, హామీలు, అన్నీ అయ్యా యి. కానీ చిత్రమేమంటే అంతా ముగిసాక అసలు ఆ పార్టీకే అనుమానం బీజం పడింది.. ఈడివల్ల అవుద్దా అని తమలో తాము ఢిల్లీ వెళ్లేక అనుకున్నారు. కానీ తప్పదు. కాంగ్రెస్ తన అభ్యర్ధిని ప్రకటించి ఇల్లిల్లూ తిరగనారంభించింది. ఇక టీఆర్ఎస్ అయితే మూటలతోపాటు రంగప్రవేశం చేశారు. టీఆర్ఎస్ అందరికంటే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. డబ్బులకు కొదవలేదు, మనోడిని గెలి పించి తీరా లన్న పట్టుదల్లో ఉంది.
ఇదిలా ఉండగా, ఓటరుకి పూర్వం మంచినీళ్ల పాకెట్లు, సారా పాకెట్లు ఇచ్చేవారు, పోనీ గట్టిగా అడిగితే యాభయ్యో వందో ఇచ్చేవారు. గుడిసెమీదో, ఇంటిమీదో పెంకులేసుకునేందుకు నలుగుర్ని పురమాయిం చేవారు. అపుడు కేవలం ఓటరు. ఇపుడు ఓటరు ఏకంగా మంత్రినీ తన గుమ్మంలో నిలబెట్టే స్థాయికి చేరు కున్నాడు. ఊహించని విధంగ ఎదురుకోల సాగుతోంది మునుగోడులో. ఒక్క పొలస కోసం పూర్వం నాలు గు కుటుంబాలు కొట్టుకు చచ్చేయిట. అదుగో అలా ఉంది. లక్షలు పోసి ఒక్క ఓటు కోసం బక్క చిక్కిన కార్మికుడిని, రైతుని బుజాలకెత్తుకుంటున్నారు. ఏడాది క్రితమే రైతులు వారి సమస్యల పరిష్క రించమని ప్రాణాలు పోయేంతగా గోడుపెట్టుకున్నారు. అవేమీ కాలేదు. పైగా అన్ని ప్రాంతాల్లోనూ ప్రభు త్వాలు, అధికారులు చాలా లైట్ తీసుకున్నారు. ఇప్పుడు గేమ్ రివర్స్ అయింది. ఓటరు తలపాగా చుట్టుకుని ఇంటి గుమ్మంలో చిన్న రాయిమీద రాజులా కూర్చుంటున్నాడు. ఎమ్మె ల్యేలు అతన్ని ధనికుడిని చేయడానికి క్యూకట్టి డబ్బు మూటలు దింపుతూ రేటు అడిగేస్తున్నారు. బేరాలాడుతున్నారు. మొన్నటి వరకూ ఓటుకు పదివేలు, ఇపుడు తులం బంగారం కూడా ఇస్తామం టున్నారు. లక్ష్మీదేవికి చిరాగ్గా అనిపిస్తోంది!
మునుగోడు ఎన్నిక నేపథ్యంలో నగరంలో హవాలా ముఠాలు విస్తరించాయి. గడిచిన 10 రోజుల వ్యవధి లో రూ.10 కోట్లు హవాలా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్‌లో ఈరోజు ఉదయం రూ.2.4 కోట్ల నగదును వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకుంది. అలాగే అక్టోబర్ 11న గాంధీ నగర్‌లో రూ.3.5 కోట్లు, అక్టోబర్ 9న జూబ్లీహిల్స్‌లో రూ.2.49 కోట్లు, అక్టోబర్ 8న చంద్రాయన్‌గుట్ట వద్ద రూ.79 లక్ష లు, అక్టోబర్ 7న వెంకటగిరిలో రూ.54 లక్షలు, సెప్టెంబర్ 29న రూ.1.24 కోట్ల నగదును టాస్క్‌ఫోర్స్ పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. మరి ఈ లక్ష్మీదేవి యాత్ర ఎక్కడితో ఆగుతుందోమరి.