వైసీపీ ఉనికి పాట్లు!
posted on Oct 12, 2022 @ 11:19AM
భోజనంలో పదార్ధాలు బాగుంటే హోటల్‌వాడినైనా మెచ్చుకుంటాం. కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారని నాయకులు మెచ్చుకుంటారు. కానీ నాయకులే అన్యాయంగా తయారయితే ఎవరు మెచ్చుకుంటారు. ఏపీలో అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా పాలనాపరంగా ప్రజలనుంచి ఏమాత్రం శభాష్ అని పించుకోని జగన్ సర్కార్ తిప్పలు నానాటికి పెరుగుతున్నాయి. పార్టీలో ప్రతీ ఒక్కరికీ జగన్ క్లాస్ తీసు కుని మళ్లీ రంగంలోకి దింపారు. ఈసారి మంచి రిపోర్టే వినగల్గుతామని. కానీ ఈసారి ప్రజాస్పందన అంతకు ముందుకంటే అన్యాయంగా ఉంటోంది. తాజాగా మంగళవారం (ఆగష్టు 11) కృష్ణాజిల్లా కంకి పాడు మండలం నెప్పల్లి ఎస్సీ కాలనీకి వెళ్లిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వెళ్లారు.
ఊహించని విధంగా ఆయన్ను అక్కడి కాలనీవాసులు నిలదీశారు. ఏం అద్భుతంగా పనిచేస్తున్నారని కలవ డానికి వచ్చారని ప్రశ్నించారు. ఇళ్లస్థలాల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, అర్హులయిన వారిని పట్టించుకోలేదని ప్రశ్నించారు. అసలు ఇక్కడి సమస్యలేవీ చాలారోజులుగా ఎవరూ పట్టించుకోలే దని కాలనీవాసులు ఒక్కసారిగా ఎమ్మెల్యేని నిలదీశారు. ఆయనకు నోట మాట రాలేదు. వాగ్దానాలు, ప్రకటనలే తప్ప తమకు చేసిందేమిటని ప్రశ్నించారు.
ప్రజల మన్ననల కోసం చేస్తున్న అన్ని యత్నాలు దెబ్బతిన్నాయి. తాజాగా ఎన్టీఆర్ వర్సిటీ పేరు మార్చి మరింత భ్రష్టు పట్టింది. దీనిమీద ఏపీ జనంతో పాటు అన్ని పార్టీల్లోని ఎన్టీఆర్ అభిమానులు తిట్టిపోశారు. ఆఖరికి వైసీపీ పార్టీలోనివారూ విసుక్కున్నారు..ఇలాంటి పన్జేసేడేంటని. తన పరిపాలన గురించి ప్రజా భిప్రాయ సేకరణ కోసం గడప గడపకు ప్రభుత్వం అంటూ ఒక కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యేలను వారి వారి ప్రాంతాల్లో ప్రతీ గడప ను పలకరించాలని ఆదేశించారు జగన్. కానీ వారికి కాళ్లనొప్పులు శాపనార్ధాలే మిగిలాయి తప్ప ఒరిగిందేమీ లేదు. దీనికి తోడు జగన్ ఆమధ్య మంత్రులకు, ఎమ్మెల్యేలకు గట్టి హెచ్చరికే చేశారు. పార్టీని గెలిపించే బాధ్యత సీరియస్‌గా తీసుకోవాలని ఎవరు ఎక్కడెక్కడ దృష్టి కేంద్రీకరిం చాలన్నదీ చెప్పారు. కానీ ప్రభుత్వం పరంగా ప్రజాభీష్ట కార్యక్రమాలు, పనులు చేయడంతోనే ప్రజలకు చేరువయ్యేదన్నది అధినేత పట్టించుకోకుండా తనవారిని తిట్టి పోయడంలోనే ఆసక్తి చూపుతున్నారు. అతి సన్నిహితులనుకున్న వారికి కూడా జగన్ వడ్డన అయింది.
దీనికి తోడు ప్రజలు టీడీపీని అధికారంలోకి రావాలని గట్టిగా కోరుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్ర బాబు నాయకుడు రెండింతల ఉత్సహంతో ప్రజల్లోకి వెళ్లడం, అన్ని ప్రాంతాల్లోనూ టీడీపీకి బ్రహ్మరథం పట్టడం ఇపుడు వైసీపీకి నిద్రలేకుండా చేస్తోంది. సర్వేలు, స్వపక్షాల మాట ఎలా ఉన్నా, జగన్ మాత్రం టీడీపీ హోరుకి భయకంపితుడయ్యాడన్నది మాత్రం నిజం. ఆ భయాందోళనలతోనే సన్నిహితులనూ కాళ్లకు బలపాలు గట్టుకుని అన్ని ఊళ్లూ తిరగమన్నారు. తిరుగుతూండడంతో, ప్రజల్ని కలవడంతోనే అయిపోతుందా? పడిపోయిన గ్రాఫ్ ప్రయాణాలతో పెరగదుగదా? ప్రజల మన్ననలు అందుకోలేక పోయి తర్వాత ప్రయాణాలు, ప్రసంగాలు, ప్రయోగాలతో జరిగేదేమిటి? ఓటరే కాదంటున్న పుడు దేవుడు కూడా ఏం చేయలేడు. ప్రజల్ని దూరం చేసుకున్న తర్వాత ప్రజల వద్దకు పాలన, గడప గడపకు వంటివి కేవలం యాడ్స్ వరకూ బావుంటాయి గాని పోయిన ప్రతిష్టను తీసుకురాలేవు, వెళ్లిన వారికి తిట్టదండకమూ తగ్గదు. తెలిసినా వైసీపీ నాయకులకు, ఎమ్మెల్యేలకు ఈ దండకాల ఆహ్వానాన్ని తప్పక అంగీకరించాల్సి వస్తోంది. చేసినది ఇసుమంతైనా ప్రజోహితం ఉండా లన్నది సూక్తి. ఇక్కడే జగన్ తప్పులో కాలేసేరు. ఆయన వేసిన తర్వాత వంతులవారీగా మిగతా వారూ బురదలో పడా ల్సిందేగదా. అదే జరుగుతోంది..అదే బురద అంటించుకోవాల్సివస్తోంది. ముందు పిడకలు వేసినవారు బురదనీ అంటించుకోవాలి మరి.