నేడు ఢిల్లీకి సోనియా
posted on Sep 11, 2013 @ 10:02AM
ట్రీట్‌మెంట్ కోసం అమెరికాకు వెళ్లిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీ రానున్నరు. గత ఏడాది జరిగిన ఆపరేషన్ కు సంబంధించి సోనియా అమెరికాలో వైద్యపరీక్షలు చేయించుకున్నరని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆహారభద్రతా బిల్లుపై లోక్ సభలో చర్చ జరుగుతున్న సమయంలో తీవ్ర అస్వస్థతకు గురయిన సోనియాగాంధీ తరువాత వైధ్యపరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లారు.
వారం రోజుల రెస్ట్ తర్వాత సోనియాగాంధీ అమెరికా నుంచి వస్తుండటంతో రాష్ట్ర నేతలు డిల్లీ బాటపట్టనున్నారు. ఇప్పటికే తెలంగాణ విషయంలో కేబినేట్ నోట్ రెడీ చేసిన హోం శాఖ కూడా సోనియా ఆమోదం కోసం ఎదురుచూస్తుంది. దీంతో సోనియా ఢిల్లీ వచ్చిన వెంటనే మరోసారి రాజకీయసమీకరణాలు వేగంగా మారనున్నాయంటున్నారు విశ్లేషకులు.