సమైక్య రాష్ట్ర సమితి పార్టీ
posted on Sep 11, 2013 7:57AM
తెలంగాణ ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంద్ర జిల్లాల్లో ఉధ్యమం ఉవ్వెత్తున్న ఎగసి పడుతున్న నేపధ్యంలో ఇప్పుడు సమైక్యాంద్రకు మద్దతుగా ఓ రాజకీయపార్టీ కూడా ఆవిర్భవించబోతుంది. ఈ మేరకు విజయవాడకు చెందిన హోమియోపతి డాక్టర్ ఎస్. విశ్వనాధం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నారు.
తెలంగాణ సాదన కోసం ఏర్పాడిన తెలంగాన రాష్ట్ర సమితి లాగానే సమైక్యాంద్ర కోసం సమైక్య రాష్ట్రసమితీ అనే పార్టీని స్ధాపించనున్నారు. ఈ పార్టీకి అధ్యక్షుడిగా విశ్వనాధం, సెక్రటరీగా ఎస్. శరత్‌బాబు వ్యవహరిస్తామని పార్టీ వ్యవస్థాపకులు ప్రకటించారు.
దీంతో పాటు తమ వెనుక ఏ రాజకీయనాకుల అండలేదని, ఎవరి బినామీగా ఈ పార్టీని స్ధాపించడం లేదని సెప్టెంబర్ 12న అధికారికంగా పార్టీ ఏర్పాటును ప్రకటిస్తామని విశ్వనాథం తెలిపారు.